pawan-kalyan kapu sankshema sena meeting
ఈ క్రమంలోనే తాజాగా తొలి గళం వినిపించింది. 2024లో కాపు కులస్థుడే ఏపీకి ముఖ్యమంత్రి అవుతారని కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ తేల్చిచెప్పారు. రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న 80శాతానికి పైగా ప్రజలకు ఇప్పటివరకు ఎందుకు రాజ్యాధికారం రాలేదని ప్రశ్నించారు.
ఏపీలో 3శాతం ఉన్న రెడ్లు 45 ఏళ్లు పరిపాలించారు. 3శాతం ఉన్న కమ్మ కులస్థులు 25 ఏళ్లు పరిపాలించారు. రాష్ట్రంలో మెజార్టీ సంఖ్యలో ఉన్న కాపులు ఎందుకు రాజ్యాధికారం సాధించడం లేదన్న ప్రశ్నను చింతా మోహన్ వ్యక్త పరిచారు. ఏపీలో తూర్పు కాపులు, బలిజలు, కాపులు ఇలా దాదాపు కోటి మంది జనాభా ఉన్నారని లెక్కలు తీర్చారు.
కాపు కులస్థులు గనుక ఒక్క రోజు కూడా అధికారం రుచిచూడలేదని.. ఇప్పటికైనా కాపులు మారాల్సిన అవసరం ఉందని చింతా మోహన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి పదవికి కాపులు అనుభవించాల్సిన అవసరం ఉందన్నారు.
ఏపీలో అధికారంలోకి వస్తున్న రెడ్లు, కమ్మ నేతలు కాపులకు డిప్యూటీ సీఎం, మంత్రి పదవులు ఇచ్చి వారిని అధికారానికి దూరం చేస్తున్నారు. ఈ పదవుల వల్ల ఉపయోగం లేదు. రాజ్యాధికారం అంటే అంతిమంగా ముఖ్యమంత్రి పదవియే. 2024లోనైనా ఏపీ రాజకీయాలను శాసించే స్థితిలో ఉన్న కాపులు ముఖ్యమంత్రి పదవిని చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మేరకు కాపు నేతల్లో ,ప్రజల్లో అంతర్మథనం మొదలైతే వారికి ఖచ్చితంగా రాజ్యాధికారం దక్కుతుంది. ఆ దిశగా పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.