https://oktelugu.com/

Actress Keerthi Suresh: ఒకే నెలలో రెండు సినిమాలతో వస్తున్న… కీర్తి సురేశ్

Actress Keerthi Suresh: నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది కీర్తి సురేశ్. మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ మనసు దోచేసింది ఈ అమ్మడు. తెలుగు, తమిళ, మళయాళ భాషలలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది కీర్తి. ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ కెరీర్ పరమ్గా ఫుల్ ఫార్మ్ లో ఉందని చెప్పాలి. సావిత్రి జీవితకథ ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ” మహానటి ” సినిమాతో కీర్తి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. మహానటి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 1, 2021 / 07:16 PM IST
    Follow us on

    Actress Keerthi Suresh: నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది కీర్తి సురేశ్. మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ మనసు దోచేసింది ఈ అమ్మడు. తెలుగు, తమిళ, మళయాళ భాషలలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది కీర్తి. ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ కెరీర్ పరమ్గా ఫుల్ ఫార్మ్ లో ఉందని చెప్పాలి. సావిత్రి జీవితకథ ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ” మహానటి ” సినిమాతో కీర్తి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. మహానటి సినిమాలో కీర్తి నటనతో కట్టిపడేసిందనే చెప్పాలి. గత యేడాది కీర్తి సురేశ్ నటించిన ‘పెంగ్విన్, మిస్ ఇండియా’ చిత్రాలు ఓటీటీలో విడుదలై ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.

    కాగా ఈ యేడాది థియేటర్లలో విడుదలైన ‘రంగ్ దే’ కూడా యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు  నవంబర్ నెలలో వరుసగా రెండు సినిమాలను రిలీజ్ చేయబోతుంది కీర్తి. అందులో మొదటగా రజనీకాంత్ ‘పెద్దన్న’కాగా… రెండోది ‘గుడ్ లక్ సఖీ’ చిత్రం. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రలు పోషించిన “గుడ్ లక్ సఖి ” సినిమాలో కీర్తి సురేశ్ గ్రామీణ యువతిగా కనిపించబోతోంది. అలాగే స్పోర్ట్స్ డ్రామాగా రూపుదిద్దుకున్న ‘గుడ్ లక్ సఖీ’ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు నాగేశ్‌ కుకునూర్‌ తెరకెక్కించారు.

    ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి నవంబర్ 26న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు తెలిపారు. అలానే సూపర్‌స్టార్, రజినీకాంత్ నటించిన చిత్రం ‘అన్నాత్తే’. దీనిని తెలుగులో ” పెద్దన్న ” పేరుతో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ  సినిమాని… సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. నయనతార హీరోయిన్‌ గా నటిస్తుండగా… కీర్తి సురేష్ రజినీకాంత్ చెల్లెలి క్యారెక్టర్ లో కనిపించనుంది. ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల కానుంది.