దేవాదాయ ఆస్తుల విషయంలో పరిధి దాటుతున్నారు..!

దేవాలయాల ఆస్తుల పరిరక్షణ, హిందూ ధర్మ పరిరక్షణ, టీటీడీ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా బీజేపీ, జనసేన పిలుపు మేరకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉపవాస దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ఉపవాస దీక్షలో భాగంగా గుంటూరు లోని తన నివాసం వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ దీక్ష చేశారు. ఈ సందర్భంగా కన్నా మీడియాతో మాట్లాడుతూ జగన్ సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రంలో హిందూ ధర్మానికి, మతానికి ప్రమాదం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో […]

Written By: Neelambaram, Updated On : May 26, 2020 7:05 pm
Follow us on


దేవాలయాల ఆస్తుల పరిరక్షణ, హిందూ ధర్మ పరిరక్షణ, టీటీడీ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా బీజేపీ, జనసేన పిలుపు మేరకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉపవాస దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ఉపవాస దీక్షలో భాగంగా గుంటూరు లోని తన నివాసం వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ దీక్ష చేశారు. ఈ సందర్భంగా కన్నా మీడియాతో మాట్లాడుతూ జగన్ సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రంలో హిందూ ధర్మానికి, మతానికి ప్రమాదం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో మత మార్పిడులు, దేవాలయ భూముల విషయంలో కానీ ప్రభుత్వం తన పరిధిని దాటి ముందుకు వెళ్తోందన్నారు.

మంగళగిరి, అన్నవరం ఆలయ భూములను తీసుకునే యత్నం చేసినా ఆందోళనతో వెనక్కి తగ్గారని చెప్పారు. ఇపుడు ఏకంగా తిరుమల వెంకన్న భూములకు ఎసరు పెట్టారని, దానికి ఎప్పుడో చేసిన తీర్మానం ప్రాతిపదిక చేసుకున్నారని తెలిపారు. ధార్మిక సంస్థలు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయని చెప్పారు. బిజెపి, జనసేన దీనిపై పోరాటానికి పిలుపు నిచ్చాయన్నారు.

టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి మాత్రం భూముల అమ్మకానికి కేవలం రోడ్ మ్యాప్ ఇచ్చామని చెప్పారని తెలిపారు. సుబ్బారెడ్డి ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ఆలయ భూముల రక్షణ విషయంలో చాలా మాట్లాడారని తెలిపారు. వైకాపా పార్టీ అనేది మోసపూరితంగా ఏర్పడిన పార్టీ అని విమర్శించారు. ప్రభుత్వం నిన్న ఇచ్చిన జీవో నాలుక గీసుకునేందుకు పనికిరాదన్నారు. రద్దు చేయమన్నది ఒక జీవో, ప్రభుత్వం నిలుపుదల చేసింది మరో జీవో అని చెప్పారు. టిటిడి భూముల విషయంలో 888 జీవోకి పూర్తిగా వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలిపారు. దేవుడిని కూడా మోసం చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన ప్రతి పని ప్రజలను మోసం చేసేదిగా ఉందని చెప్పారు. ప్రభుత్వం టీటీడీ భూముల అమ్మకానికి వ్యతిరేకం కాదని స్పష్టమవుతోందన్నారు. కేవలం ప్రజలను మబ్యపెట్టేందుకే నిన్నటి జీవో ఇచ్చారని తెలిపారు. జిల్లాల్లో మూడో జాయింట్ కలెక్టర్లను నియమించే సమయంలో 9వ అంశంగా దేవాలయాల భూములు అని పెట్టారని, దీనిపై చాలా అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ కార్యకలాపాలకు దేవాదాయ భూములు వాడుకుంటారని అనుమానాలు ఉన్నాయని తెలిపారు.

కరోనాను అడ్డు పెట్టుకొని సింహాచలం భూములను ఆక్రమించుకుంటున్నారని తెలిపారు. ఆలయ భూముల్లో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింహాచలం భూములు కాపాడాలని కోరారు. ప్రభత్వం నుంచి టీటీడీ ఆస్తులను రక్షించేందుకు అందరూ ముందుకు రావాలి సూచించారు. ఈ ఉపవాస దీక్షలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ, జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస యాదవ్,కల్యాణం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.