రాజకీయం అంటే ఎత్తులు పైఎత్తులు. ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య నువ్వానేనా అన్నట్లు సాగుతున్నాయి. కులాల సమీకరణలు మారుతున్నాయి. జగన్, చంద్రబాబు ఎవరికి వారే తమ ప్రయత్నాలు మమ్మరం చేశారు. కుల సంఘాలను తమవైపు తిప్పుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. సోషల్ మీడియాను సైతం వాడుకుని తమ పబ్బం గడుపుకోవాలని భావిస్తున్నారు. ఇదే సందర్భంలో కుల సంఘాలను ప్రభావితం చేసే పనుల్లో నిమగ్నమైపోయారు.
తెలుగుదేశం పార్టీకి కులాలే ఆయువుపట్టు. వాటి మీద ఆధారపడే ప్రతిసారి విజయం సాధిస్తుంది. ప్రస్తుతం జగన్ కన్ను కూడా కులాల మీదే పడింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత బీసీల మీద కన్నేసి వారిని తమవైపు తప్పుకునేందుకు శ్రమిస్తున్నారు. దీంతో 2019లో విజయం సాధించారు. సీఎం అయ్యాక వారి కోసం ప్రత్యేకంగా 60 కార్పొేషన్లు ఏర్పాటు చేశారు. దీని ఫలితంగా స్థానిక ఎన్నికల్లో మంచి విజయాలు సాధించారు. ప్రస్తుతం బాబు సొంత సామాజిక వర్గాన్ని జగన్ టార్గెట్ చేశారు. చాలా కాలంగా ఉన్న ఒకఅతి ముఖ్యమైన డిమాండ్ ని తీర్చి జగన్ ఆయా వర్గాలకు కూడా చేరువైపోయారు.
ఏఫీలో అగ్రవర్ణ కులాలుగా ఉన్న చాలా కులాలు పేదరికంలో ఉన్నాయి. దీంతో అలాంటి వారి కోసం చంద్రబాబు బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అదే క్రమంలో జగన్ కూడా రెడ్డి, కమ్మ, క్షత్రియ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో చంద్రబాబు చేయలేని పనిని జగన్ చేశారని అందరు అనుకున్నారు. కమ్మ సామాజిక వర్గం నేతలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. రాజులు కూడా రాజ్యాలు పోయి సామాన్యులుగా జీవిస్తున్నారు. రెడ్లు కూడా వైసీపీకి దన్నుగా ఉంటున్నారు. దీంతో జగన్ తీసుకున్న నిర్ణయంపై అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కమ్మలు ఏపీ జనాభాలో మూడు నుంచి నాలుగు శాతం ఉంటారు. కృష్ణ, గుంటూరు వంటి చోట్ల వీరి ఆధిపత్యం ఎక్కువ. టీడీపీ ఏర్పాటు అయ్యాక వారంతా ఇందులో చేరారు. టీడీపీని తమ సొంత పార్టీగా భావించారు. రెండేళ్లుగా కమ్మలు వైసీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ కమ్మలకోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో వారు వైసీపీని నమ్ముకుని దాని వెంటే నడవాలని చూస్తున్నారు. మొత్తానికి జగన్ కమ్మలను తమ వైపు తిప్పుకోవడంలో సఫలీకృతులైనట్లు తెలుస్తోంది.