
ఏపీ బీజేపీ సీనియర్ నేతకు అందలం దక్కింది. ఈయనకు బీజేపీ అధిష్టానం సముచిత స్థానం కల్పించింది. పలు రాష్ట్రాలకు కత్త గవర్నర్లను నియమించిన కేంద్ర ప్రభుత్వం అందులో ఏపీకి చెందిన బీజేపీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబుకు గవర్నర్ పదవిని కట్టబెట్టింది.
పలు రాష్ట్రాలకు కొత్తగా గవర్నర్లను కేంద్రం నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ బీజేపీ సీనియర్ నేత కంభం పాటి హరిబాబుకు గవర్నర్ పదవి దక్కింది.
మిజోరం గవర్నర్ గా కేంద్రం కంభంపాటి హరిబాబును నియమించింది.ఇక కేంద్రమంత్రి థాపర్ చంద్ గెహ్లాట్ కు గవర్నర్ పదవి ఇవ్వడం విశేషం. ఆయనను కేంద్రమంత్రి పదవి నుంచి కర్ణాటక గవర్నర్ గా పంపింది.
ఇన్నాళ్లు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న తెలంగాణకు చెందిన బండారు దత్తాత్రేయను హరియాణాకు మార్చింది. ఇక మధ్యప్రదేశ్ గవర్నర్ గా మంగూభాయ్ పటేల్ ను నియమించారు.
గోవా గవర్నర్ గా పీఎస్ శ్రీధరన్ పిళ్లైను, త్రిపుర గవర్నర్ గా సత్యదేవ్ నారాయణ్, ఝార్ఖండ్ గవర్నర్ గా రమేశ్ బైస్ ను , హిమాచల్ గవర్నర్ గా రాజేంద్ర విశ్వనాథ్ ను నియమిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ బీజేపీ సీనియర్ నేత కంభంపాటికి గవర్నర్ పదవి దక్కడంపై ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు హర్షం వ్యక్తం చేశారు. బీజేపీలో సీనియర్లకు ఇది దక్కిన గుర్తింపుగా పేర్కొన్నారు.ప్రతి ఒక్కరికి బీజేపీలో ప్రాధాన్యత దక్కుతుందని తెలిపారు.
Congratulations to Shri Dr. Kambhampati Hari Babu Garu on being appointed as Hon'ble Governor of Mizoram. His experience and vast knowledge will help the people of Mizoram. My best wishes to him for new role.
@HariBabuBJP pic.twitter.com/Qh6Bv9UwiR
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) July 6, 2021