కమల్‌నాథ్ ప్రభుత్వం బలపరీక్ష రేపే!

రాజకీయంగా అస్థిరతకు గురైన మధ్యప్రదేశ్ లోని కమల్‌నాథ్ ప్రభుత్వం సోమవారం బలపరీక్షను ఎదుర్కోనుంది. ఈ విషయాన్ని స్వయంగా మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ లాల్జీ టాండనే ప్రకటించారు.ఈ మేరకు గవర్నర్ టాండన్ స్పీకర్ నర్మదా ప్రసాద్ ప్రజాపతిని ఆదేశించినట్లు తెలుస్తున్నది. బలపరీక్ష నిర్వహించాలంటూ శనివారం సాయంత్రం మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ బృందం గవర్నర్ లాల్జీ టాండన్‌ను కోరింది. ‘‘బీజేపీ నేతలం గవర్నర్ లాల్జీ టాండన్‌తో భేటీ అయ్యాం. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాకముందే […]

Written By: Neelambaram, Updated On : March 15, 2020 11:17 am
Follow us on

రాజకీయంగా అస్థిరతకు గురైన మధ్యప్రదేశ్ లోని కమల్‌నాథ్ ప్రభుత్వం సోమవారం బలపరీక్షను ఎదుర్కోనుంది. ఈ విషయాన్ని స్వయంగా మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ లాల్జీ టాండనే ప్రకటించారు.ఈ మేరకు గవర్నర్ టాండన్ స్పీకర్ నర్మదా ప్రసాద్ ప్రజాపతిని ఆదేశించినట్లు తెలుస్తున్నది.

బలపరీక్ష నిర్వహించాలంటూ శనివారం సాయంత్రం మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ బృందం గవర్నర్ లాల్జీ టాండన్‌ను కోరింది. ‘‘బీజేపీ నేతలం గవర్నర్ లాల్జీ టాండన్‌తో భేటీ అయ్యాం. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాకముందే బలపరీక్ష నిర్వహించాలని వినతి పత్రం సమర్పించాము’’ అని చౌహాన్ తెలిపారు.

కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం మైనారిటీలో పడిపోయిందని, అందుకని రాజ్యాంగ పరంగా వారికి ప్రభుత్వాన్ని నడిపే హక్కే లేదని చౌహాన్ స్పష్టం చేశారు. కమల్‌నాథ్ సర్కారు అసెంబ్లీలో తమ బల పరీక్షను నిరూపించుకోవాలని, అంత వరకూ ఎలాంటి నిర్ణయాలు తీసుకునే హక్కు వారికి లేదని చౌహాన్ చెప్పారు.

22 మంది ఎంఎల్‌ఎలు రాజీనామా చేశారని, వీడియోల ద్వారా తమ రాజీనామాలు ధ్రువీకరించారని ఆయన గుర్తు చేశారు. గవర్నర్ నియమించిన పరిశీలకుని ద్వారా విశ్వాస పరీక్ష జరగాలని, ఇదంతా వీడియో చిత్రీకరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంఎల్‌ఎల బంధువులను, రాష్ట్ర ప్రభుత్వం బెదిరిస్తోందని, ఈ ఎంఎల్‌ఎలకు వ్యతిరేకంగా కేసులు నమోదయ్యాయని చౌహాన్ ఆరోపించారు.

తమ నేత సింధియాజీ శుక్రవారం దాడికి గురయ్యారని, రాజీనామా చేసిన ఎంఎల్‌ఎలు కేంద్ర బలగాల రక్షణ లేనిదే బెంగళూరు నుంచి తిరిగి రాలేమని డిమాండ్ చేస్తున్నట్టు చౌహాన్ చెప్పారు.