MLC Kavitha: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు సందర్భంగా దేశ నలుమూలల నుంచి చాలామంది విషెస్ చెబుతున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా రాజకీయ నాయకులు సైతం ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ`క్రమంలో ఓ అభిమాని చేసిన అత్యుత్సాహం వివాదానికి దారి తీసింది. అది కూడా కవిత విషయంలో కావడం గమనార్హం.

హైదరాబాద్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన చార్మినార్ పై కవిత బర్త్ డే ఫ్లెక్సీ ని ప్రదర్శించడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. మొఘల్ పుర డివిజన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ పుప్పాల రాధాకృష్ణ శనివారం నాడు చార్మినార్ వద్దకు వెళ్ళాడు. తన వెంట తెచ్చుకున్న కవిత పుట్టినరోజు ఫ్లెక్సీని ఎవరికీ కనిపించకుండా చార్మినార్ పైకి తీసుకు వెళ్ళాడు.
Also Read: ఏపీలో మద్యనిషేధానికి మంగళం.. పిండుకోవడమే మిగిలింది
అనంతరం చార్మినార్ పై ఆ ఫ్లెక్సీని ప్రదర్శించడంతో కింద ఉన్న వారు ఫోటోలు తీస్తుండగా.. సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రాధాకృష్ణపై కేసు కూడా నమోదు చేశారు. గతంలో కూడా ఇదే రాధాకృష్ణ ఇలాంటి వివాదాస్పద పనులు చేసి కేసుల్లో ఇరుక్కున్నారు. అప్పటి నుంచి అతనిపై పలు కేసులు ఉన్నాయి.

అయితే చార్మినార్ వద్ద నిత్యం గట్టి నిఘా ఉంటుంది. సెక్యూరిటీ హై లెవల్ లో ఉంటుంది. అయినా కూడా అతను చార్మినార్ మీదకు ఫ్లెక్సీని ఎలా తీసుకెళ్లాడన్నది చర్చనీయాంశం అవుతోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అతను ఇలా చేశాడని అంటున్నారు చాలామంది. అధికారులు అతనికి ఏమైనా సహకరిచారా అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ప్రగతిభవన్ ఆఫీసర్లపై టీఆర్ ఎస్ అనుమానం.. ఆ పని చేస్తున్నారంట..
[…] Aadavallu Meeku Joharlu Box Office Collections: కూల్ హీరో శర్వానంద్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా తిరుమల కిషోర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా కోసం ఓ రేంజ్ లో హడావిడి చేశారు. అయితే, సినిమా ప్రమోషన్స్ లో చూపించిన హడావుడి.. సినిమాలో మాత్రం కనిపించలేదు. ఫస్ట్ వీకెండ్ నుంచి ఈ సినిమాకు కలెక్షన్స్ చాలా వీక్ గానే ఉన్నాయి. […]
[…] Also Read: చార్మినార్‌పై కవిత బర్త్ డే ఫ్లెక్… […]
[…] […]