Homeఎంటర్టైన్మెంట్Bandla Ganesh Tweet: త్రివిక్రమ్ అడ్డు లేదు.. ఇక అందర్నీ వచ్చేయమంటున్నాడు

Bandla Ganesh Tweet: త్రివిక్రమ్ అడ్డు లేదు.. ఇక అందర్నీ వచ్చేయమంటున్నాడు

Bandla Ganesh Tweet: పవర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ కు తాను పరమభక్తుడిని అని సగర్వంగా చాటి చెప్పుకునే నిర్మాత బండ్ల గ‌ణేష్, ప్రస్తుతం పవర్ స్టార్ పై అభిమానాన్ని మరోసారి ఘనంగా చాటుకున్నాడు. ఈ నెల 14న గుంటూరు జిల్లా తాడేప‌ల్లి మండ‌లం ఇప్ప‌టం గ్రామంలో జ‌న‌సేన ఆవిర్భావ స‌భ జ‌ర‌గ‌నున్న సంగతి తెలిసిందే. ఈ స‌భ‌ను విజ‌య‌వంతం చేసేందుకు జ‌న‌సైనికులు శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేకుంటూ పోతున్నారు.

bandla ganesh
bandla ganesh

అయితే, తాజాగా బండ్ల గ‌ణేష్ ట్వీట్ జనసైనికుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇంతకీ బండ్ల గణేష్ ఏమి ట్వీట్ చేశాడు అంటే.. “వీరులారా ధీరులారా, జన సేన సైనికులారా !! రండి కదలి రండి కడలి అలగా తరలి రండి. నేను కూడా వస్తున్నాను. మన దేవర నిజాయతీకి సాక్షిగా నిలబడడం కోసం, తెలుగు వాణి వాడి వేడి నాడి వినిపించడం కోసం, అమరావతి నించి హస్తిన దాకా అలజడి పుట్టించడం కోసం కలుద్దాం. కలిసి పోరాడదాం” అని బండ్ల గ‌ణేష్‌ కామెంట్స్ చేశాడు.

Also Read: కేసీఆర్ సార్ ప్రకటన అయిపాయే.. నోటిఫికేషన్లు ఎప్పుడు సార్?

అన్నట్టు పవర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ కు పరమభక్తుడిని అని ప్రమోట్ చేసుకునే నిర్మాత బండ్ల గ‌ణేష్, ప్రస్తుతం పవర్ స్టార్ కోసం కథను వెతికే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో ఓ తమిళ యువ రచయిత జాన్ అనే అతని దగ్గర, బండ్ల ఒక కథను ఓకే చేసినట్లు తెలుస్తోంది. త్వరలో పవన్ కు కూడా ఆ కథ వినిపించనున్నారు. కథలో పవన్ పాత్ర కాస్త కొత్తగా ఉంటుందని.. కాలేజీ లెక్చరర్ గా పవన్ సినిమాలో కనిపిస్తారని సమచారం.

మరి కాలేజీ నేపథ్యంలో సినిమా అంటే.. అది పవన్ లెక్చరర్ పాత్ర అంటే.. ఆసక్తి రెట్టింపు అయ్యేలా ఉంది. ఏది ఏమైనా అభిమానులు ఎంతమంది ఉన్నా.. పవన్ కి బండ్ల గ‌ణేష్ లాంటి పరమభక్తుడు మాత్ర ఇంకొకరు లేరు. అందుకే బండ్లకు పవర్ స్టార్ ఎట్టకేలకూ మళ్లీ ఓ సినిమాని నిర్మించే అవకాశం ఇచ్చాడు. ఆ మాటకొస్తే ఎప్పటి నుండో బండ్లకు పవన్ తో మళ్ళీ మరో సినిమా చేయాలని ఓ కల ఉంది.

Bandla Ganesh
Bandla Ganesh

పైగా పవన్ కళ్యాణ్ హీరో అంటే.. ఏ స్టార్ డైరెక్టర్ అయినా డేట్స్ ఎడ్జెస్ట్ చేసి మరీ సినిమా చేయడానికి ఒప్పుకుంటాడు. ఆ మధ్య ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ – పరుశురామ్ కాంబినేషన్ లో బండ్ల గ‌ణేష్ సినిమా ప్లాన్ చేసాడని.. ‘సర్కారు వారి పాట’ పూర్తవ్వగానే ఈ సినిమా మొదలవుతుందని వార్తలు వచ్చాయి. మరి ఈ వార్త నిజం అవుతుందేమో చూడాలి.

Also Read: అతడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా.. ఇప్పుడు హీరో అయ్యాడండోయ్..

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular