YS Vivekanada Reddy Murder Case: వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ కుటుంబం చుట్టు ఉచ్చు బిగుసుకుంటోంది. కీలక మలుపులు తిరుగుతున్న కేసు ఓ కొలిక్కి వస్తోంది. ఇందులో మొదట సాధారణ మరణంగా పరిగణించినా తరువాత కాలంలో హత్య కేసుగా నమోదు కావడం తెలిసిందే. ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుని విమర్శలు చేసిన వైసీపీ ఇప్పుడు డోలాయమానంలో పడింది. తన కుటుంబ సభ్యులే నిందితులుగా తేలడంతో వైసీపీకి ఎదురుదెబ్బలే తగలనున్నాయి.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాత్రపై ఆధారాలు లభ్యమవుతున్నాయి. దీంతో కేసు పురోగతి సాధిస్తోంది. సీబీఐని కూడా నిందిస్తున్నారు. కీలక సాక్ష్యాలు సేకరించడంతో వివేకా కేసు ఛేదనలో మరిన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి. దస్తగిరి అప్రూవర్ గా మారడంతో కేసు మరో మలుపు తిరుగుతోంది. వైఎస్ కుటుంబమే ప్రధాన నిందితులుగా తేలడంతో వారిపై కేసులు నమోదు చేసేందుకు సీబీఐ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కేసు గమనం మరో మార్గంలో పయనిస్తున్నట్లు సమాచారం.
Also Read: మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే జీవో 217 వెనక్కి తీసుకోవాల్సిందేనా?
మొదట వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని నమ్మించే ప్రయత్నాలు చేశారు. కానీ ఒక్కొక్క నిజం తెలుస్తుంటే అందరు విస్తుపోతున్నారు. సాక్ష్యాలన్ని వైఎస్ కుటుంబమే హత్య చేసిందని చెప్పే విధంగా క్కా ఆధారాలు లభిస్తున్నాయి. అప్పటి సీఐ శంకరయ్య ఇచ్చిన వాంగ్మూలాన్ని సీబీఐ రికార్డు చేసింది. దీనికి తోడు అప్పటి డీఎస్పీ వాంగ్మూలం కూడా తీసుకున్న సీబీఐ కేసును వేగవంతంగా దర్యాప్తు చేస్తోంది. దీంతో నిజాలు ఒక్కోటి బయట పడుతున్నాయి.
వివేకా హత్య సమయంలో పులివెందుల డీఎస్పీగా పనిచేసిన రెడ్డివారి వాసుదేవన్ సాక్ష్యం కూడా కీలకం కానుంది. వైఎస్ వివేకా హత్య సమయంలో ఆయన ఇక్కడ విధులు నిర్వహిస్తుండే వారు కావడంతో ఆయనను కూడా సీబీఐ ప్రశ్నించింది. కేసులో పలు ఆధారాలు సంపాదించింది. దీంతో వైఎస్ కుటుంబం మొత్తం వివేకా హత్య కేసులో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో ఇందులో ఇంకా నిజాలు వెల్లడయ్యే సూచనలు కనిపిస్తున్నట్లు సమాచారం.
దీంతో వైఎస్ అవినాష్ రెడ్డి, బాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డిలను నిందితులుగా చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కేసు ఎటు వైపు దారి తీస్తుందో తెలియడం లేదు. ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న కేసులో ఒక్కో సాక్ష్యం లభిస్తుంటే వైఎస్ కుటుంబంలో విషాదం పెరిగిపోతోంది.
Also Read: ఏపీలో జవహర్ రెడ్డిదే అంతా నడుస్తోందా?