Homeఎంటర్టైన్మెంట్Actor Naresh Ex Wife: భారీ స్కాంలో సీనియర్ నటుడు నరేష్ మాజీ భార్య.....

Actor Naresh Ex Wife: భారీ స్కాంలో సీనియర్ నటుడు నరేష్ మాజీ భార్య.. అసలు ఆమె ఏం చేసిందో తెలుసా?

Actor Naresh Ex Wife: హైదరాబాద్‌లో మరో భారీ స్కాం వెలుగు చూసింది. ఇప్పటికే కిట్టీ పార్టీల పేరుతో సంపన్న మహిళలను టార్గెట్ చేసుకుని కోట్లు కొల్లగొట్టిన శిల్పా చౌదరి ఉదంతం బయటపడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో పోలీసుల విచారణలో మరో స్కాం బహిర్గతమైంది. సీనియర్ నటుడు నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి అనేక మందిని మోసం చేసి డబ్బులు కూడబెట్టినట్లు తెలుస్తోంది.

Actor Naresh Ex Wife
Senior Actor Naresh, Ramya

తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా పక్క రాష్ట్రం కర్ణాటకలోనూ రమ్య బాధితులు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నరేష్ ఆస్తులను ఎరగా వేసి అధిక వడ్డీ ఇస్తానంటూ మధ్యతరగతి ప్రజలను నమ్మించి రమ్య రూ.కోట్లలో అప్పులు చేసి ఉడాయించిందని సమాచారం. ఆమె కేవలం నరేష్ పేరునే కాకుండా ఏపీ కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి పేరుతో కూడా ప్రజల వద్ద డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు.

Also Read: అక్కడమ్మాయి.. ఇక్కడ అబ్బాయి నుంచి భీమ్లానాయక్ వరకూ.. పవన్ ‘పవర్’ ఎంత?

రమ్య రఘుపతి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆమె కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె. అందుకే రఘువీరా పేరుతోనే జనాల దగ్గర అప్పులు తీసుకుని ఎగ్గొట్టింది. బెంగళూరుకు చెందిన మోతీమహల్ తనదే అని.. అంతేకాకుండా మారియట్ హోటల్‌లోనూ తనకు వాటాలు ఉన్నాయని జనాలను నమ్మించింది. రమ్య మోసాలను ఆలస్యంగా గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో రమ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Actor Naresh Responds On Ex Wife Ramya Raghupathi Cheating Case || Ok Telugu Entertainment

అయితే రమ్య మోసాలపై సీనియర్ నటుడు నరేష్ స్పందించారు. రమ్య వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. ఆరేళ్లుగా రమ్యకు తాను దూరంగా ఉంటున్నానని.. ఆమె వ్యవహారాల్లో తన కుటుంబానికి ఎలాంటి ఇన్వాల్వ్‌మెంట్ లేదన్నారు. గతంలోనూ ఆమె మోసాలు తెలిసి పబ్లిక్ నోటీసు ఇచ్చానని నరేష్ గుర్తుచేశారు. కాగా 8 ఏళ్ల క్రితం నరేష్, రమ్యకు వివాహం కాగా మనస్పర్థలు రావడంతో ఆరేళ్ల క్రితమే వీరు విడిపోయారు.

Also Read: భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లేవారికి ముఖ్య గమనిక.. ఇవి పాటించండి

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Exit mobile version