KA Paul- Bandi Sanjay: తెలంగాణల రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. బీజేపీ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న క్రమంలో పలు పార్టీలు దాన్ని అడ్డుకోవాలని చూస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై విమర్శలు చేస్తున్నారు. ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కేంద్రంతో మాట్లాడతానని చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో మరోమారు రాజకీయ వేడి రగులుకున్నట్లు సమాచారం. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం మామూలే. అది ఎన్నికల సమయంలో ఇంకా ఎక్కువగా ఉంటుందన్నది వాస్తవమే.
తెలంగాణలో అన్ని మతాలు కలిసుంటే బండి సంజయ్ వారి మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో మత విద్వేషాలు రగిలి గొడవలకు దారి తీస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలు వేరు మతాలు వేరు. ఎవరికి ఇష్టమైన మతం వారు అవలంభించుకోవచ్చని సూచిస్తున్నారు. అంత మాత్రాన ఏదో జరిగిపోతున్నట్లు అందరిలో భయాందోళనలు కలిగేలా చేయడం సబబు కాదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read: NTR Anna Canteen: ఏపీలో తెరుచుకుంటున్న అన్న క్యాంటీన్లు
బీజీపీని నిలువరించడానికి కేఏ పాల్ ను కేసీఆర్ తీసుకొచ్చారనే వాదనలు వస్తున్నాయి. తెలంగాణలో బీజేపీని అడ్డుకోవాలంటే ఎవరో ఒకరు కావాలనే ఉద్దేశంతోనే కేఏ పాల్ ను రంగంలోకి దించినట్లు సమాచారం. మొత్తానికి రాష్ట్రంలో రాజకీయాలు దారి తప్పుతున్నాయనే వాదన తెర మీదకు తెస్తున్నారు. బండి సంజయ్ ను బాధ్యుడిగా చేస్తూ విమర్శలకు దిగుతున్నారు. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నట్లు ఆరోపిస్తున్నారు మరోవైపు ముందస్తు ఎన్నికలకు వెళతారనే డిమాండ్ కూడా ప్రధానంగా వస్తోంది. దీంతో తెలంగాణ, ఏపీ సీఎంలు ఇద్దరు ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఖాయమనే జోస్యం చెబుతున్నారు.
బండి సంజయ్ నే టార్గెట్ గా చేసుకున్నారు. దీంతో ఆయనపైనే నేరుగా విమర్శలకు దిగుతున్నారు. రాష్ట్రంలో పాలన టీఆర్ఎస్ ది కావడంతో ఏదైనా చేయాలంటే టీఆర్ఎస్ కే సాధ్యం అవుతుంది కానీ బండి సంజయ్ ఎలా బాధ్యుడవుతారనే వాదన బీజేపీ నేతలు తెస్తున్నారు. తెలంగాణలో బీజేపీ నానాటికి ఎదుగుతున్నందును దానికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే కేఏ పాల్ సంజయ్ ను లక్ష్యంగా చేసకుని విమర్శలు చేస్తున్నట్లు సమాచారం. పైగా టీఆర్ఎస్ తత్తుగా వ్యవహరిస్తోంది.
Also Read:Beer From Urine: మూత్రం, మురుగు నీటితో బీరు తయారీ.. యమా టేస్టీ అంటున్న మద్యం ప్రియులు