Homeఆంధ్రప్రదేశ్‌KA Paul: కేఏ పాల్‌ తీరే వేరప్పా!

KA Paul: కేఏ పాల్‌ తీరే వేరప్పా!

KA Paul: ఆయన ఎన్నికలప్పుడే కన్పిస్తాడు. ఎన్నికలున్నప్పుడే ఓ పార్టీ పెట్టి ఓట్ల కోసం వింతగా, విచిత్రంగా మాట్లాడుతాడు. ఎన్ని చెప్పినా ఆయనను అక్కడి ప్రజలు గెలిపించబోరు. ఆయన చెప్పేదంతా విని, ఆయన్ని ఓ పొలిటికల్‌ కమెడియన్‌గా భావిస్తారు. ఈపాటికే ఆయనెవరో అర్థమై ఉంటుంది. ఆయనే కేఏ పాల్‌. ఏపీ ప్రజలను కడుపుబ్బ నవ్విస్తున్న వ్యక్తి ఆయనే.. ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు. మాట ప్రచారకుడు సంచలనాలు స ష్టించిన పాల్‌. ఇటీవల ఏపీ ఎన్నికల్లో బాగా సందడి చేశారు. తన పార్టీ ప్రజాశాంతి ఏపీ ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని, తానే కాబోయే సీఎం అంటూ ప్రచారం కూడా బాగా చేశారు. ఇక తన హావభావాలతో రాజకీయాల్లో కూడా మంచి వినోదాన్ని పంచారు. ఏ పాల్‌ గత ఎన్నికల సమయంలో ప్రజాశాంతి పార్టీ తరఫున అభ్యర్థులను నిలబడుతున్నానని.. చంద్రబాబును, జగన్‌ను కూడా ఓడించి ఏపీలో అధికారంలోకి వస్తానని.. పదే పదే చెబుతూ.. మీడియా ముందుకు వచ్చిన కేఏ పాల్‌.. ఎన్నికల తర్వాత.. అడ్రస్‌ లేకుండా పోయారు. అయితే.. తరచుగా ఆయన జూమ్‌ ద్వారానో.. ఆన్‌లైన్‌ ద్వారానో.. యూట్యూబ్‌ ద్వారానో.. తన అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. మీడియా డిబేట్‌లలోనూ ఆయన తన గళం వినిపిస్తున్నారు. తాజాగా ఒక చానెల్‌ డిబేట్‌లో పాల్గొన్న కేఏ పాల్‌.. ఏపీ సీఎం జగన్‌పైనా.. రాష్ట్ర అప్పులపైనా.. ముఖ్యంగా అమరావతి రాజధాని.. ప్రజల ఉదాసీన వైఖరిపైనా పాల్‌ నిప్పులు చెరిగారు.

KA Paul
KA Paul

చంద్రబాబు, జగన్‌ను మట్టికరిపిస్తానని, అధికారం తనదేనని, పవన్‌ తనతో కలిస్తే స్వీప్‌ చేస్తానంటూ సాధ్యం కానీ మాటలు చెప్పి ఆశ్చర్యపరిచారు. అయితే ఆయన చెప్పింది, సాధించింది ఏమిటన్నది పక్కన పెడితే ఎన్నికల సమయంలో ఏపీ ప్రజలకు మంచి వినోదాన్ని పంచారు. ఇక ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయో అందరికీ తెలుసు. ఈ ఫలితాల తర్వాత పాల్‌ అడ్రెస్‌ లేరు అనుకోండి. కానీ సడెన్‌గా ఇండియా వచ్చి ఓ టీవీ చానెల్‌ డీబేట్‌లో పాల్గొన్నారు. రాష్ట్రంలో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఆరు మాసాల్లోనే తాను మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానని చెప్పిన జగన్‌.. రెండున్నరేళ్ల కాలంలో అత్యంత వరెస్ట్‌ సీఎంగా పేరు తెచ్చుకున్నారని.. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఆయన తండ్రి వైఎస్‌ కానీ.. ఇతరులు కానీ.. ఇలా బ్యాడ్‌ నేమ్‌ను తెచ్చుకోలేదని తెలిపారు.

నిజానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ సీఎం అయ్యే వరకూ దాదాపు పదేళ్ల పాటు నిత్యం ప్రజల్లో ఉండేందుకే ప్రాధాన్యత ఇచ్చారు. 2014 లో కొద్ది పాటి శాతం ఓట్లతో మిస్‌ అయిన అధికారం 2019 లో సాధించారు. సంక్షేమం పేరుతో ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్న సీఎం జగన్‌ ఒక్కరే. ఏపీలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. ఇటువంటి సమయంలో ఏపీలో సీఎం జగన్‌ జనాదరణ చెక్కు చెదరలేదనే అభిప్రాయం నెలకొని ఉంది. ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ పేరుతో ఒక సర్వే చేసింది. అందులో చెబుతున్న విషయాలు ఇప్పుడు వైసీపీలో హాట్‌ టాపిక్‌ గా మారాయి. జాతీయ స్థాయిలో ఉత్తమ ముఖ్యమంత్రుల్లో జగన్‌ నాలుగో స్థానంలో నిలిచారు. తొలి స్థానంలో ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్య నాద్‌, రెండో స్థానంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, మూడో స్థానంలో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఉండగా, నాలుగో స్థానంలో ఏపీ సీఎం జగన్‌ నాలుగో స్థానంలో 6 శాతం మద్దతుతో నిలిచారు. కానీ కేఏ పాల్‌ మాటలేమో వింతగా ఉన్నాయి.

అంతేగాకుండా రాష్ట్రంలో అప్పులే తప్ప అభివ ద్ది కనిపించడం లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు పాల్‌ విరుచుకుపడ్డారు. 5 నుంచి 10 ఏళ్లలో చేసిన అప్పును.. జగన్‌ ప్రభుత్వం ఒక్క ఏడాదిలో చేసిందని.. ఇది రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి నెలా 8 నుంచి 10 వేల కోట్లు అప్పులు చేస్తున్నారని.. అన్న ఆయన ఇలా ఎన్నాళ్లు చేస్తారని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వ అధినేత సీఎం జగన్‌ తీసుకుంటున్నే నిర్ణయాలు.. చేస్తున్న అప్పులకు సమాధానం చెప్పలేక..వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా మధన పడుతున్నారని.. చాలా మంది తనకు ఈ విషయాన్ని కూడా చెప్పారని పాల్‌ అన్నారు. పైకి ఏమీ అనలేక వారిలో వారే నలిగిపోతున్నారని చెప్పారు. 22 మంది ఎంపీలు ఉండి కూడా కేంద్రాన్ని ప్రశ్నించలేని పరిస్థితి ఎందుకు వచ్చిందన్నారు. తనపై ఉన్న 32 సీబీఐ కేసులకు జగన్‌ భయపడుతున్నారని అన్నారు. ఈ విషయాన్ని కూడా తాను ఎన్నికలకు ముందు చెప్పానని.. కేసులు ఉన్న వ్యక్తిని సీఎం చేస్తే.. ఇలానే ఉంటుందని అన్నానని.. అయితే.. అప్పుడు తన మాట ఎవరూ వినిపించుకోలేదన్నారు.

Also Read: Cinema Tickets: సినిమా టికెట్​ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వంపై నిర్మాత సి కళ్యాణ్​ సంచలన వ్యాఖ్యలు

ప్రజలదే తప్పంట..
గత ఎన్నికల సమయంలో తాము చెప్పిన మాటలను ప్రజలు లైట్‌ తీసుకున్నారని అన్న పాల్‌.. ఓటును 2000, 5000 లకు అమ్ముకుని ప్రజలు పెద్ద తప్పు చేశారని విమర్శించారు. ప్రజలు తమ విలువైన ఓటును ఇలా అమ్ముకుంటే.. ఇలాంటి వారే అధికారంలోకి వస్తారని.. చెప్పారు. ప్రజలు ఇప్పటికైనా.. తమ మనసులోని ఆవేదనను జగన్‌కు వినిపించేలా సోషల్‌ మీడియా ద్వారా.. నినాదాలు పంపాలని.. పాల్‌ పిలుపునిచ్చారు.

Also Read: Saiteja: అంచెలంచెలుగా ఎదిగిన సాయితేజ.. ‘రావత్’ను మెప్పించాడు?

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular