Justice Chandru: ఏపీ రాజకీయ వ్యవహారాలపై మద్రాస్ హైకోర్టు మాజీ సీజే చంద్ర వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇంకా రచ్చ కొనసాగుతూనే ఉంది. చంద్ర వ్యాఖ్యలపై ఇప్పటికే హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరిన్ని వ్యాఖ్యలు చేశారు. కేవలం పదవుల కోసమే జస్టిస్ చంద్రు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పొగుడుతున్నారని ఆరోపించారు. అయితే తాజాగా చంద్రబాబు కామెంట్స్ పై జస్టిస్ చంద్ర స్పందించి ఆయనకు కౌంటర్ ఇచ్చారు. ఏపీ సర్కారు హైకోర్టులో పోరాటం చేయాల్సి వస్తోందంట ఆయన వైసీపీ సర్కారుకు అనుకూలంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విజయవాడలోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆయన.. వైసీపీ ప్రభుత్వానికి ఎందుకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారన్న విషయం చర్చకు వచ్చింది. ప్రస్తుతం రాజకీయంగా ఈ విషయంపై తీవ్ర స్థాయిలో చర్చ మొదలైంది.

ఆయనకు ఎలాంటి సంబంధము లేకుండానే ఆంధ్రప్రదేశ్‌కు విచ్చేసి ఇక్కడి ప్రభుత్వానికి సపోర్ట్ చేసి వ్యాఖ్యలు చేయడంతో చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే సుప్రీం కోర్టు మాజీ సీజే ఆయన కొడుకుకు పదవి తీసుకొని వైసీపీ సర్కారును పొగుడుతున్నారని విమర్శించారు చంద్రబాబు. విజయవాడలో పర్యటించిన టైంలో చంద్రు కామెంట్స్‌పై మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ వస్తున్న ఆరోపణలపై ఆయన ఫస్ట్ టైం రియాక్ట్ అయ్యారు. ఓ సంస్థకు మెయిల్ రూపంలో తన అభిప్రాయాన్ని తెలిపారు చంద్రు. చంద్రబాబునాయుడు చేసిన కామెంట్స్ పై సైతం అందులో ఆయన స్పందించారు. కేవలం పదవుల కోసమే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారన్న చంద్రబాబు విమర్శలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చెత్త వార్తలు నమ్మవద్దన్నారు. తాను రిటైరైన తర్వాత తొమ్మిది సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం నుంచీ ఎలాంటి పదవిని పొందలేదని క్లారిటీ ఇచ్చారు. మరి ఈ కామెంట్స్ ఇక్కడితో ఆగుతాయా? లేదంటే మరోసారి వీటిపై టీడీపీ స్పందిస్తుందా అనేది వేచిచూడాలి. ఈ కామెంట్స్ ఇక్కడితో ఆగేలా లేవని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Omicron in AP: టెన్షన్.. టెన్షన్.. ఏపీలో ఒమిక్రాన్ కలకలం.. అప్రమత్తమైన అధికారులు..