https://oktelugu.com/

Director Rajamouli: బాహుబలి 3 తీయడానికి స్కోప్ ఉందన్న రాజమౌళి…

Director Rajamouli: తెలుగు చిత్ర పరిశ్రమను ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా బాహుబలి… ప్రపంచమంతా రికార్డులు సృష్టించి పాన్ ఇండియా లెవెల్లో టాలీవుడ్ సత్తా చాటిన దర్శకుడు రాజమౌళి. బాహుబలి 1,2 పార్ట్ లు విజువల్ గా అద్భుత కళాఖండాలు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాల తరువాత జక్కన్న మరో అద్భుతం ఆర్ఆర్ఆర్. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 16, 2021 / 06:45 PM IST
    Follow us on

    Director Rajamouli: తెలుగు చిత్ర పరిశ్రమను ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా బాహుబలి… ప్రపంచమంతా రికార్డులు సృష్టించి పాన్ ఇండియా లెవెల్లో టాలీవుడ్ సత్తా చాటిన దర్శకుడు రాజమౌళి. బాహుబలి 1,2 పార్ట్ లు విజువల్ గా అద్భుత కళాఖండాలు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాల తరువాత జక్కన్న మరో అద్భుతం ఆర్ఆర్ఆర్. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు రాజమౌళి. భవిష్యత్తులో బాహుబలి 3 ఉండే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

    Director Rajamouli

    Also Read: “పుష్ప” రాజ్ కు బెస్ట్ విషెస్ చెప్పిన చిట్టిబాబు ” రామ్ చరణ్ “…

    రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో ఈ మూవీ ప్రమోషన్ లో పాల్గొన్న జక్కన్న మాట్లాడుతూ… బాహుబలి 3 తీయడానికి స్కోప్ ఉంది అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో బాహుబలి 3 తీస్తాను. ప్రస్తుతానికి ఇంతే చెప్పగలను.. ఇంతకన్నా ఎక్కువ చెప్తే ఫోకస్ అంతా అటే వెళ్తోంది. అందుకే ఇప్పుడే ఎలాంటి విషయాన్ని నేను చెప్పలేను” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆర్ఆర్ఆర్ తరువాత జక్కన్న మహేష్ బాబుతో ఒక సినిమా చేయబోతున్నాడు.. ఈ సినిమా తరువాత బాహుబలి 3 ఉండబోతుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. బాహుబలి 1,2 పార్ట్ లతోనే చరిత్ర సృష్టించిన జక్కన్న బాహుబలి 3 తో చరిత్ర తిరగరాస్తాడేమో చూడాలి. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మెగా, నందమూరి ఫ్యామిలిలకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్… తారక్ కి జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ నటిస్తున్నారు.

    Also Read: మరో సరికొత్త షోకు శ్రీకారం చుట్టిన ‘ఆహా’