https://oktelugu.com/

Telangana: తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికలు?

Telangana: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ కు ఎదురులేకుండా పోయింది. వరుస ఎన్నికల్లో ఏకపక్ష విజయాలు నమోదు చేస్తూ దూసుకెళ్లిన టీఆర్ఎస్ అదే స్పీడుతో రెండోసారి అధికారంలోకి వచ్చింది. ప్రజల్లో వ్యతిరేకత రాకముందే సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లి ప్రతిపక్ష పార్టీలను బోల్తా కొట్టించారు. దీంతో మరో ఐదేళ్లు టీఆర్ఎస్సే అధికారంలో ఉండే ఛాన్స్ దక్కించుకుంది. కేసీఆర్ ఊహించినట్లు ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు పుంజుకున్నాయి. ఆ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 18, 2021 2:09 pm
    Follow us on

    Telangana: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ కు ఎదురులేకుండా పోయింది. వరుస ఎన్నికల్లో ఏకపక్ష విజయాలు నమోదు చేస్తూ దూసుకెళ్లిన టీఆర్ఎస్ అదే స్పీడుతో రెండోసారి అధికారంలోకి వచ్చింది. ప్రజల్లో వ్యతిరేకత రాకముందే సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లి ప్రతిపక్ష పార్టీలను బోల్తా కొట్టించారు. దీంతో మరో ఐదేళ్లు టీఆర్ఎస్సే అధికారంలో ఉండే ఛాన్స్ దక్కించుకుంది.

    Telangana

    Telangana

    కేసీఆర్ ఊహించినట్లు ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు పుంజుకున్నాయి. ఆ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత కొంచెం బయటపడింది. ఇక టీఆర్ఎస్ ఎనిమిదేళ్ల పాలనలో టీఆర్ఎస్ హామీలు ఇచ్చిన హామీలన్నీ ఇంకా నెరవేరలేదు. దళితులకు మూడెకరాల పథకం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, కేజీ టూ పీజీ అమలు వంటి పథకాలు అమలుకు నోచుకోవడం లేదు.

    టీఆర్ఎస్ పాలనలో కొన్నివర్గాల ప్రజలు మేలు జరుగుతుండటంతో మరికొన్ని వర్గాల్లో మాత్రం పూర్తి వ్యతిరేకత నెలకొంటుంది. టీఆర్ఎస్ హయాంలో రైతులకు భారీగానే లబ్ధి చేకూరుతుంది. అయితే వరి ధాన్యం కొనుగోలు విషయం సర్కారు కప్పదాట్లు వేయడంతో ఆ వర్గంలోనూ ఇటీవల కాలంలో వ్యతిరేకత వ్యకమవుతోంది. మరోవైపు నిరుద్యోగులు కేసీఆర్ సర్కారుపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

    నోటిఫికేషన్లు రాకపోవడంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తమ ఆత్మహత్యకు కేసీఆరే కారణమంటూ సూసైడ్ లేఖరాస్తుండటం ఆపార్టీపై ప్రజల్లో వ్యతిరేకతకు కారణమవుతోంది. ఇటీవల ధాన్యం కొనుగోలు విషయంలో, వరికి బదులు ఆరుతడి పంటలు వేసుకొని ప్రభుత్వం రైతులను నియంత్రిస్తుండటం లాంటి ఘటనలు టీఆర్ఎస్ పై వ్యతిరేకతను క్రమంగా పెంచుతున్నాయి.

    ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టం కన్పించింది. ఈటల రాజేందర్ ను ఓడించేందుకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం తరలివచ్చినా బీజేపీ గెలుపును అడ్డుకోలేకపోయింది. ప్రజల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకతను గ్రహించిన కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నారనే టాక్ విన్పిస్తోంది.

    Also Read: మాజీమంత్రిని ప‌ట్టించుకోని టీఆర్ఎస్‌.. ఆ పార్టీలోకి జంప్ అవుతారా..?

    కేసీఆర్ ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలే ఇందుకు నిదర్శనంగా కన్పిస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఢీకొట్టేలా కేసీఆ్ సన్నహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే రేపటి నుంచి జిల్లాల టూర్ మొదలు పెట్టబోతున్నారు. వనపర్తితో మొదలు కానున్న సీఎం పర్యటన జనగామ, నాగర్ కర్నూర్, జగిత్యాల, వికరాబాద్, నిజామాబాద్ జిల్లా వారీగా కొనసాగనుంది.

    ఈ జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల భవనాల ప్రారంభోత్సవాలు, ఎత్తిపోతల పథకం, డబుల్ బెడ్ ర్రూం ఇళ్ల శంకుస్థాపనలు తదితర కార్యక్రమాలు చేయనున్నారు. ఎక్కడికి వెళ్లినా రైతులకు కేంద్రం చేస్తున్న మోసాన్ని ఆయన వివరించనున్నారట. కేంద్రంపై వ్యతిరేకతను పెంచడమే లక్ష్యంగా సీఎం పర్యటనలు ఉండనున్నాయని తెలుస్తోంది. కేంద్రం బూచిని సాకుగా చూపి తెలంగాణలో సీఎం కేసీఆర్ మరోసారి అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    Also Read: కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరుబాటకు సిద్ధమేనా?