Jr NTR Reaction: చంద్రబాబు ఏడుపు.. వైసీపీ అరాచకంపై జూ.ఎన్టీఆర్ ఘాటు స్పందన

Jr NTR Reaction: టీడీపీ అధినేత చంద్రబాబును నిండు సభలో అవమానించిన వైసీపీపై విమర్శల వాడిని ఎక్కుపెట్టారు నందమూరి ఫ్యామిలీ. ఇప్పటికే అగ్రహీరో నందమూరి బాలయ్య.. తన నందమూరి కుటుంబ సభ్యులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన మా కుటుంబంలోని ఆడవాళ్లను అవమానిస్తూ ఊరుకోం ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. తాజాగా రంగంలోకి నందమూరి హీరోలు దిగారు. నందమూరి కళ్యాణ్ రామ్ తోపాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. Also Read: చంద్రబాబు కోసం కదిలిన నందమూరి కుటుంబం, […]

Written By: NARESH, Updated On : November 20, 2021 4:45 pm
Follow us on

Jr NTR Reaction: టీడీపీ అధినేత చంద్రబాబును నిండు సభలో అవమానించిన వైసీపీపై విమర్శల వాడిని ఎక్కుపెట్టారు నందమూరి ఫ్యామిలీ. ఇప్పటికే అగ్రహీరో నందమూరి బాలయ్య.. తన నందమూరి కుటుంబ సభ్యులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన మా కుటుంబంలోని ఆడవాళ్లను అవమానిస్తూ ఊరుకోం ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. తాజాగా రంగంలోకి నందమూరి హీరోలు దిగారు. నందమూరి కళ్యాణ్ రామ్ తోపాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు.

Also Read: చంద్రబాబు కోసం కదిలిన నందమూరి కుటుంబం, బాలయ్య

Jr-NTR-releases-a-video-message-over-the-personal-abuse-on-Chandrababu-Naidus-family-members

ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరిపై పలువురు వైసీపీ నాయకులు వ్యక్తిగత విమర్శలు చేయడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై చంద్రబాబు ప్రెస్ మీట్ లో కన్నీళ్ల పర్యంతం అయ్యారు. ఈ క్రమంలోనే నందమూరి ఫ్యామిలీ మొత్తం కదిలివచ్చి తాజాగా వైసీపీ నేతలను తూర్పారపట్టారు.

వైసీపీ పాలనను అరాచక పాలనతో పోల్చాడు జూనియర్ ఎన్టీఆర్.. ప్రజా సమస్యలను పక్కనపెట్టి.. వ్యక్తిగత దూషణలకు .. అదీ ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడటం ఒక అరాచక పాలనకు నాంది అని జూనియర్ ఎన్టీఆర్ గళమెత్తారు. ట్విట్టర్ లో ఒక ప్రత్యేక వీడియోను షేర్ చేస్తూ మహిళలను కించపరుస్తూ మాట్లాడిన వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణం అని.. కానీ అవి ప్రజా సమస్యలపై జరగాలే కానీ.. వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలుగా ఉండకూడదని అన్నారు. నిన్న ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన నా మనసును కలిచివేసిందని.. ఎప్పుడైతే మనం ప్రజా సమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నామో.. ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడుతున్నామో అది ఒక అరాచక పాలనకు నాంది పలుకుతుందని ఎన్టీఆర్ దుయ్యామన్నారు.

ఈ మాటలు నందమూరి ఫ్యామిలీ సభ్యుడిగా మాట్లాడడం లేదని.. ఒక కొడుకుగా తండ్రిగా.. భర్తగా, తండ్రిగా.. ఈ దేశ పౌరుడిగా తెలుగువాడిగా మాట్లాడుతున్నానంటూ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. వైసీపీ అరాచక సంస్కృతిని వదిలేయాలని పేరు ప్రస్తావించకుండా కడిగిపారేశాడు. ప్రజా సమస్యలపై పోరాడండని.. కానీ ఇలా కాదంటూ ఎన్టీఆర్ ఈ మాటలను ఇక్కడితో ఆపాలని మనసారా కోరుకుంటున్నానంటూ హాట్ కామెంట్స్ చేశారు.

ఎన్టీఆర్ మాట్లాడిన వీడియో ఇదే

Also Read: చంద్రబాబు ఏడుపు.. సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు

చంద్రబాబు.. నాడు ఏడిపించాడు.. నేడు ఏడ్చాడు