ఇంకా పొడిగించాలి అనుకోవడం బద్దకస్తుల పని: JP

కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం మూడు వరాల పాటు లాక్‌డౌన్ ప్రకటించడం ద్వారా వైరస్ విస్తరించకుండా చేసేందుకు ఉపయోగ పడినా ఇంకా పొడిగించాలి అనుకోవడం ఏమీ చేయకుండా అంతా ఏదో చేస్తున్నామని ప్రచారం చేసుకొనే బద్దకస్తుల పని కాగలదని లోక్ సత్తా అధినేత డా. ఎన్ జయప్రకాశ్ నారాయణ్ స్పష్టం చేశారు. అయితే క్రమంగా సడలిస్తూ, వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకొంటూ, ఉత్పత్తి కార్యక్రమాలను వీలైనంత వరకు ప్రారంభించాలని ఒక న్యూస్ ఛానల్ కు […]

Written By: Neelambaram, Updated On : April 10, 2020 11:44 am
Follow us on


కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం మూడు వరాల పాటు లాక్‌డౌన్ ప్రకటించడం ద్వారా వైరస్ విస్తరించకుండా చేసేందుకు ఉపయోగ పడినా ఇంకా పొడిగించాలి అనుకోవడం ఏమీ చేయకుండా అంతా ఏదో చేస్తున్నామని ప్రచారం చేసుకొనే బద్దకస్తుల పని కాగలదని లోక్ సత్తా అధినేత డా. ఎన్ జయప్రకాశ్ నారాయణ్ స్పష్టం చేశారు.

అయితే క్రమంగా సడలిస్తూ, వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకొంటూ, ఉత్పత్తి కార్యక్రమాలను వీలైనంత వరకు ప్రారంభించాలని ఒక న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూచించారు. ఈ లోగా పెద్ద ఎత్తున వైరస్ టెస్ట్ లు జరిపి, వైరస్ సోకినా వారందరిని గుర్తించి, వేరు చేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశం మొత్తం మీద 1.20 లక్షల మందికి మించి టెస్ట్ లు జరగలేదని చెబుతూ, వచ్చే ఒకటి, రెండు నెలల్లో కనీసం కోటి మందికి టెస్ట్ లు జరపాలని కోరారు.

10 లక్షల మందికి 80 టెస్టులు మాత్రమే జరిపామని, కొన్ని దేశాలలో 15,000 వరకు టెస్ట్ లు జరిపారని చెప్పుకొచ్చారు. అందుకనే టెస్ట్ ల సంఖ్య వంద రేట్లు పెరగవలసి ఉన్నాడని తెలిపారు. అందుకోసం ర్యాపిడ్ టెస్ట్, వైరస్ ఎదుర్కొనే సామర్ధ్యపు టెస్ట్ లను విస్తృతంగా జరపాలని, అందుకోసం కేంద్రం కనీసం రూ 2,000 కోట్లతో పరికరాలు సేకరించాలని సూచించారు.

లాక్ డౌన్ ఉన్నప్పటికీ వైరస్ వ్యాప్తి చెందుతున్నదని, అయితే వ్యాధిగా మారి, మరణాలు జరగడం మాత్రం ఎక్కువగా లేదని చెబుతూ ప్రాధమిక వైద్య సదుపాయాల పట్ల ప్రభుత్వం దృష్టి సారించడానికి ఇదొక్క మంచి అవకాశమని చెప్పారు. కొన్ని ప్రభుత్వాలు జీడీపీలో 10 శాతం వరకు వైద్యం కోసం ఖర్చు చేసుంటే మనం 1 శాతం కూడా చేయడం లేదని గుర్తు చేశారు. కనీసం 2 శాతం ఖర్చు చేసిన అద్భుతంగా ప్రస్తుతం గల సదుపాయాలను పెంపొందింపవచ్చని పేర్కొన్నారు.

ప్రజలకు తాయిలాలు అందించే పధకాల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందే ధోరణులకు ఇప్పటికైనా రాజకీయ పార్టీలు స్వస్తి పొందాలని జయప్రకాశ్ హితవు చెప్పారు. స్వతంత్రం తర్వాత భారత్ ఎదుర్కొంటున్న అతి పెద్ద ఉపద్రవం ఇదే అని చెబుతూ ఇటువంటి సమయంలో తీవ్రమైన ఆర్ధిక సమస్యలు ఎదురు కావడానికి తాయిలాలకు నిధులు వృద్ధ చేయడం వల్లననే అని స్పష్టం చేశారు. ఆ విధంగా చేయక పోవడంతో అమెరికా వంటి దేశాలు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టగలుగుతున్నాయని తెలిపారు.

లాక్‌డౌన్ దారుణంగా పేదల జీవితాలు దారుణంగా మారాయని, వారిని ఆదుకొనే శక్తీ మన ప్రభుత్వాలకు లేదని చెబుతూ కేవలం కోమాలో ఉన్న ఆర్ధిక వ్యవస్థను వీలయినంత మేరకు క్రియాశీలం చేయడం ద్వారా మాత్రమే వారిని ఆదుకోగలమని స్పష్టం చేశారు. హిత వచనాలు చెప్పడంకాకుండా రాష్ట్రాలకు తాగిన వనరులు కల్పించడానికి కేంద్రం పూనుకోవాలని కోరారు.

అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా, మన దేశంలో అమ్మకపు ధరలు తగ్గించకుండా ప్రభుత్వం తన ఆదాయాన్ని విశేషంగా పెంచుకొంటున్నదని చెబుతూ ఆయా మొత్తాలలో కొంత మొత్తాన్ని వైద్య సదుపాయాలు మెరుగుపరచడం కోసం ఖర్చు పెట్టాలని కోరారు. సాంఘిక దూరం, పరిశుభ్రత పాటించమనడం వంటి సూచనలు బాగుంటాయి గాని పెద్ద మురికివాడలలో సాధ్యమా అని ప్రశ్నించారు.

ప్రస్తుతం కరోనా వ్యతిరేక పోరాటంలో మొత్తం మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు అన్ని ఒకే మాటపై ఉండటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఇదే స్ఫూర్తిని దేశంలో మౌలిక వైద్య సదుపాయాలు కొనసాగించడానికి కొనసాగించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రైవేట్ రంగంలో ఉచితంగా కరోనా టెస్ట్ లు జరపాలని సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆదేశాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వం ఎందుకని టెస్టులు జరుపలేక పోతున్నదని కోర్ట్ ప్రశ్నించదే అని విస్మయం వ్యక్తం చేశారు.