అమెరికాలో విదేశీయులకు ఉద్యోగాలివ్వాలట!

ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ పుట్టింది.. పెద్దది అయ్యింది అమెరికాలోనే.. కానీ దాన్ని ఈ స్థాయికి చేర్చడంలో విదేశీ టెక్ నిపుణుల నైపుణ్యం ఎంతో ఉంది. గూగుల్ సీఈవోగా మన భారతీయుడు సుందర్ పిచాయ్ ఉన్నాడు. ఇక మైక్రోసాఫ్ట్ కు మనోడే. ఇలా ఈ రెండు సంస్థలే కాదు.. అమెరికాలో దిగ్గజ టెక్నాలజీ సంస్థలు భారతీయుల చేతుల్లో ఉన్నాయి. అయితే తాజాగా అమెరికాలో హెచ్4 వీసాల వల్ల ఉద్యోగాల్లో పోటీతత్వం దెబ్బతింటోందని అమెరికన్లు కొందరు కోర్టు పిటీషన్ […]

Written By: NARESH, Updated On : May 15, 2021 5:46 pm
Follow us on

ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ పుట్టింది.. పెద్దది అయ్యింది అమెరికాలోనే.. కానీ దాన్ని ఈ స్థాయికి చేర్చడంలో విదేశీ టెక్ నిపుణుల నైపుణ్యం ఎంతో ఉంది. గూగుల్ సీఈవోగా మన భారతీయుడు సుందర్ పిచాయ్ ఉన్నాడు. ఇక మైక్రోసాఫ్ట్ కు మనోడే. ఇలా ఈ రెండు సంస్థలే కాదు.. అమెరికాలో దిగ్గజ టెక్నాలజీ సంస్థలు భారతీయుల చేతుల్లో ఉన్నాయి.

అయితే తాజాగా అమెరికాలో హెచ్4 వీసాల వల్ల ఉద్యోగాల్లో పోటీతత్వం దెబ్బతింటోందని అమెరికన్లు కొందరు కోర్టు పిటీషన్ వేశారు. విదేశీయులకు ఉద్యోగాలు ఇవ్వవద్దని కోరారు. ఈ పిటీషన్ పై అన్ని దిగ్గజ సంస్థలకు కోర్టు నోటీసులు పంపింది.

అయితే ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మరో 30 సంస్థల తరుఫున అఫిడవిట్ సమర్పించింది. హెచ్1బీ వీసాదారు కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని గూగుల్ విదేశీయులకే మద్దతుగా కోర్టులో పిటీషన్ వేయడం విశేషం. దీనివల్ల ఆవిష్కరణలు పెరుగుతాయని.. అమెరికాలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని గూగుల్ తెలిపింది. ఈ కార్యక్రమం అందరి కుటుంబాలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపింది.

ఇప్పటికే విదేశీయులకు అమెరికాలో ఉద్యోగాలు ఇవ్వాలని.. అమెజాన్, యాపిల్, ఈబే, అడోబ్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, పేపల్, ట్విట్టర్ సహా ఇతర కంపెనీలు హెచ్4ఈఏడీ కార్యక్రమానికి మద్దతు తెలిపాయి. ఇప్పుడు గూగుల్ వచ్చి చేరింది. గత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నప్పుడు విదేశీయులకు అమెరికాలో ఉద్యోగాలు దక్కకుండా చాలా చట్టాలు చేశారు. ఇప్పుడు బైడెన్ రావడంతో విదేశీయులకు ఊరటలభించింది. అమెరికా ఫస్ట్ నినాదంతో అమెరికన్ల ఉద్యోగాలన్నవి సెకండరీగా మారిపోయాయి.