చంద్రబాబు తప్పును బయటపెట్టిన జేసీ

టీడీపీ అధినేత చంద్రబాబు తప్పును బయటపెట్టారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఏదైనా ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడే జేసీ తప్పుఒప్పుల విషయంలో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాడు. నాడు అమరావతి విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి ఇప్పుడు ఆయనకు నోటీసులు అందాయని.. చేసుకున్నందుకు అనుభవించాల్సిందేనన్నట్టుగా జేసీ వ్యాఖ్యలు ఉన్నాయి. తాజాగా జేసీ దివాకర్ రెడ్డి హైదరాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలోకి వెళ్లి పాత కాంగ్రెస్ మిత్రులతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ […]

Written By: NARESH, Updated On : March 16, 2021 3:27 pm
Follow us on

టీడీపీ అధినేత చంద్రబాబు తప్పును బయటపెట్టారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఏదైనా ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడే జేసీ తప్పుఒప్పుల విషయంలో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాడు. నాడు అమరావతి విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి ఇప్పుడు ఆయనకు నోటీసులు అందాయని.. చేసుకున్నందుకు అనుభవించాల్సిందేనన్నట్టుగా జేసీ వ్యాఖ్యలు ఉన్నాయి.

తాజాగా జేసీ దివాకర్ రెడ్డి హైదరాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలోకి వెళ్లి పాత కాంగ్రెస్ మిత్రులతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఏపీ విడిపోకుంటే ఉజ్వలంగా ఉండేదని.. సోనియాకు చెప్పినా వినలేదని ఆవేదన చెందారు.

ఇక చంద్రబాబు కూడా వినలేదని.. నాడు తాను విశాఖపట్నంను అయినా రాజధాని చేయాలని అన్నానని.. లేదంటే దోనకొండను అయినా చేయాలని సూచించానని.. ఈ రెండు కాకుండా అమరావతిని చేశాడని జేసీ అసలు నిజాన్ని బయటపెట్టాడు.

దీంతో అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై పోలీసుల విచారణ ఎదుర్కోబోతున్నాడని.. ‘చంద్రబాబుకు సీఐడీ నోటీసుల’పై తనదైన శైలిలో విశ్లేషించాడు. చంద్రబాబు అస్సలు విశాఖ రాజధాని విషయంలో పట్టించుకోలేదన్న సంగతి తాజాగా బయటపడింది.

మా వీపు పగిలినప్పుడే చంద్రబాబుకు పగలాల్సిందని.. ఎందుకు ఆలస్యమైందనే మా అనుమానం’ అని జేసీ దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.. నోటీసులు చూసి ఆశ్చర్యపోలేదని జేసీ అన్నారు. చంద్రబాబుకు ఒక్క పేజీ మాత్రమే నోటీసు వచ్చిందని.. జగన్ కు నోటీసులు ఇవ్వాల్సి వస్తే లారీల్లో తీసుకెళ్లాలని జేసీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.