Actress Samantha: సమంత హాలీవుడ్ మూవీలో నటించడానికి కారణమైన స్టార్ హీరో ఎవరంటే ?

Actress Samantha: వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైన కానీ సినిమా కెరీర్ పరంగా మాత్రం దూసుకుపోతుంది. ఏమాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ వరుస విజయాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. సౌత్ లో స్టార్ హీరోలు అందరితో నటించి మెప్పించింది సామ్. నాగ చైతన్యతో వివాహం తర్వాత కూడా సమంత జోరు తగ్గలేదు. రంగస్థలం, ఓ బేబీ లాంటి చిత్రాలతో సమంత ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఫ్యామిలీ […]

Written By: Raghava Rao Gara, Updated On : November 29, 2021 4:31 pm
Follow us on

Actress Samantha: వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైన కానీ సినిమా కెరీర్ పరంగా మాత్రం దూసుకుపోతుంది. ఏమాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ వరుస విజయాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. సౌత్ లో స్టార్ హీరోలు అందరితో నటించి మెప్పించింది సామ్. నాగ చైతన్యతో వివాహం తర్వాత కూడా సమంత జోరు తగ్గలేదు. రంగస్థలం, ఓ బేబీ లాంటి చిత్రాలతో సమంత ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఫ్యామిలీ మ్యాన్ 2తో సమంత ఇండియా వ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకుంది. ఇటీవల వారు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత కూడా వరుస మూవీలతో అలరిస్తుంది సమంత.

ఇటీవలే సమంత ఒక హాలీవుడ్ చిత్రానికి ఓకే చెప్పింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రఖ్యాత దర్శకుడు ఫిలిప్ జాన్ దర్శత్వంలో నటించబోతున్నట్లు సమంత ప్రకటించింది. దర్శకుడు జాన్ ఫిలిప్ ఓ నవల ఆధారంగా శృంగారం అంశంపై చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ది అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఓ బేబీ చిత్రానికి కో ప్రొడ్యూసర్ గా ఉన్న సునీత తాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఆ పాత్ర కోసం సమంతను ఒక హీరో రికమెండ్ చేసారంట.

ఆ హీరో ఎవరో కాదు మన దగ్గుబాటి రానా నే.  ఈ చిత్రంలో ఎవరిని తీసుకోవాలని హీరో రానాని సునీత సలహా అడిగిందట. దీనితో రానా వెంటనే సమంత అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది అని రికమండ్ చేసినట్లు సమాచారం. మరో ఆలోచన లేకుండా సమంతని కలసి కథ వినిపించాలని రానా సునీతకు సూచించాడు. ఆ తర్వాత సునీత సమంతని కలసి కథ వివరించడంతో ఈ చిత్రం ఫైనల్ చేశారు అని సినీవర్గాల్లో చర్చించుకుంటున్నారు. సమంత నటించిన ఓ బేబీ చిత్రానికి సురేష్ బాబు ప్రధాన నిర్మాత కాగా సునీత సహ నిర్మాతగా పనిచేశారు.