Jayalalitha Audio: అంత ఆరోగ్యంగా ఉండే తమిళనాడు మాజీ సీఎం జయలలిత సీఎంగా ఉన్న సమయంలోనే సడెన్ గా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. జయలలిత మరణంపై ఇప్పటికీ ఎన్నో అనుమానాలు ఉన్నాయి. జయలలిత ఆస్పత్రిలో పడ్డాక సాధారణ ప్రజలకు ఆమె వీడియోలు, ఆడియోలు, ఫొటోలు చూపించలేదు. లోపల ఏదో జరుగుతున్నట్టు కలరింగ్ ఇచ్చారు. వైద్యులు ఏం చెప్పలేదు. ఇప్పటికీ జయలలిత మరణం తాలూకా మిస్టరీ వీడలేదు.

జయలలిత అనుమానాస్పద మృతి వ్యవహారం ఇప్పటికే కలకలం రేపుతుండగా తాజాగా ఆర్ముగం కమిషన్ రిపోర్ట్ తో మరిన్ని కొత్త విషయాలు వెలుగుచూశాయి. ఆపోలో ఆస్పత్రిలో జయలలితకు సరైన చికిత్స అందలేదనే విషయాన్ని అవి నిర్ధారించేలా ఉన్నాయి.
జయలలిత ఆస్పత్రిలో బెడ్ పై ఉన్న సమయంలో మాట్లాడినట్టుగా చెబుతున్న కొన్ని మాటల ఆడియో క్లిప్ లీక్ కావడం సంచలనమైంది. ‘డాక్టర్లపై జయలలిత ఫైర్ అయ్యారు. తాను పిలిస్తే ఎందుకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో దగ్గుతూ బాధపడుతుంటే పట్టించుకోరా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ ఆడియోను అక్కడే ఉన్న సిబ్బంది రికార్డు చేసినట్టు తెలుస్తోంది.
జయలలితకు చికిత్స అందించిన లండన్ డాక్టర్ రిచర్డ్ బేలే ఈ సందర్భంగా శశికళతో మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది. జయను విదేశాలకు తీసుకెళ్లడం మంచిదని డాక్టర్ రిచర్డ్ చెబితే.. ‘మధ్యలో జోక్యం చేసుకున్న శశికళ’.. విదేశాలకు పంపడం అవసరమా? అని ప్రశ్నించారు. దీనికి డాక్టర్ మాత్రం విదేశాలకు వెళ్లాల్సిందేనని.. జయలలిత కూడా అంగీకరించారని బేలే చెప్తున్నారు.దీంతో ఈ వీడియో కలకలం రేపుతోంది. జయలలితను శశికళనే కుట్ర పన్ని చంపించిందా? అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
స్వయంగా జయలలితనే తనను ఆస్పత్రిలో పట్టించుకోవడం లేదన్న ఆడియో.. విదేశాలకు పంపకుండా శశికళ నిరాకరించిన ఆడియోలు చూశాక తమిళనాట పెనుదుమారం రేపింది.
జయలలిత మృతిపై మిస్టరీ చేధించేందుకు తమిళనాడు ప్రభుత్వం అర్ముగస్వామి కమిషన్ వేసింది. ఈ కమిషన్ నివేదిక సంచలనం రేపుతోంది. ఈ నివేదికలో భాగంగానే ఆడియో, వీడియోలు ప్రభుత్వానికి కమిషన్ సమర్పించింది. వీటిని కొందరు లీక్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తమిళనాడు సీఎంగా ఉండి చికిత్స అందక ఆమె పడిన బాధ చూసి ఇప్పుడు అందరూ అయ్యోపాపం అంటున్నారు. ఇందులో కుట్ర కోణం ఉందని.. వెలికితీయాలని డిమాండ్ చేస్తున్నారు.
#Jayalalithaa's audio clip goes viral #JayalalithaaDeath pic.twitter.com/beG7zS3xCj
— Janardhan Veluru (@JanaVeluru) October 20, 2022