T20 World Cup India vs Pakistan : టీ20 ప్రపంచ కప్ ఆస్టేలియా వేదికగా జరగనుంది. ఈ నెల 23న భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ నిర్వహణకు సిద్ధమయ్యాయి. మెల్ బోర్న్ లో జరిగే మ్యాచ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో నెగ్గి సత్తా చాటాలని భావిస్తున్నాయి. రోహిత్ శర్మకు ఇది తొలి ప్రపంచ కప్ కావడంతో భారత జట్టు ప్రణాళికలు రచిస్తోంది. హీట్ మ్యాన్ నేతృత్వంలో టీమిండియా బోణీ కొట్టి శుభారంభం చేయాలని భావిస్తోంది. ప్రపంచ కప్ లో ప్రత్యర్థిని కట్టడి చేసి పాక్ కు సవాలు పంపాలని చూస్తోంది. పాక్ ను ఓడించి వారి కవ్వింపులకు సరైన సమాధానం చెప్పాలని ప్రయత్నిస్తోంది.

ఇప్పటికే ఈ మ్యాచ్ కు సంబంధించి టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.దీంతో మ్యాచ్ పై అందరిలో ఉత్కంఠ నెలకొంది. కానీ వరుణుడు కనికరిస్తేనే మ్యాచ్ జరుగుతుంది. ఎనభై శాతం వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తుండటంతో అభిమానుల ఆశలు తీరుతాయో లేదో అనే అనుమానాలు వస్తున్నాయి. పాకిస్తాన్ తో కీలక మ్యాచ్ కావడంతో రెండు జట్లలో అంచనాలు పెరుగుతున్నాయి. ఇందులో కచ్చితంగా నెగ్గాలని రెండు జట్లు ప్రయత్నిస్తున్నాయి.
పాకిస్తాన్ ఆటగాళ్లు టీమిండియాపై సెటైర్లు వేస్తుండటంతో ఎలాగైనా మ్యాచ్ నెగ్గి వారికి తగిన గుణపాఠం చెప్పాలని చూస్తోంది. పాక్ ఆటగాళ్లు టీమిండియాకు సవాళ్లు చేస్తుండటంతో మన ఆటగాళ్లలో కసి పెరుగుతోంది. పాక్ ఆటగాళ్లను కట్టడి చేసి వారి పొగరు అణచాలని ఆశిస్తున్నారు.
దీనికి గాను కసరత్తులు చేస్తున్నారు. ప్రాక్టీసు ముమ్మరం చేశారు.
పాకిస్తాన్ ఆటగాళ్లలో అహంకార ధోరణి పెరుగుతోంది. అందుకే వారు మాటల్లో అదుపు ఉండటం లేదు. కావాలనే టీమిండియాను టార్గెట్ చేసుకుని విమర్శలకు దిగడం ఆందోళన కలిగిస్తోంది. భారీగా పరుగులు చేసి పెద్ద టార్గెట్ ను ముందు ఉంచి వారిని దెబ్బ కొట్టాలని భావిస్తోంది. దీనికి గాను ఆటగాళ్లలో ఆత్మస్థైర్యం నింపుతున్నారు. కప్ గెలవడం కంటే పాక్ ను కంట్రోల్ చేయడమే తమ లక్ష్యంగా టీమిండియా అడుగులు వేస్తోంది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకుల్లో ఉత్కంఠ ఇంకా ఎక్కువ అవుతోంది.