Homeజాతీయ వార్తలుJawaharlal Nehru: దేశ దిశను మార్చిన నెహ్రూ నిర్ణయాలు.. దశాబ్దాల వెనుకబాటుకు కారణం..

Jawaharlal Nehru: దేశ దిశను మార్చిన నెహ్రూ నిర్ణయాలు.. దశాబ్దాల వెనుకబాటుకు కారణం..

Jawaharlal Nehru: భారత స్వతంత్య్రానంతర రాజకీయాల్లో పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ నిర్ణయాలు దేశ రాజకీయ, వ్యూహాత్మక, భూభాగ, నీటి, రక్షణ రంగాలపై దీర్ఘకాల ప్రభావాన్ని చూపాయి. ఆయన దృష్టిలో సహజవనరులు, పొరుగు దేశాలతో సంబంధాలు, అంతర్జాతీయ వ్యూహాలు కొత్త భారత్‌ నిర్మాణానికి మూలాధారం కావాలని భావించినా, కొంత నిర్ణయాలు ఆ దేశాభివృద్ధి పథాన్నే మలుపుతిప్పాయి.

Also Read: అమిత్ షా ఉరుముతున్నాడు.. మావోయిస్టుల కథ ముగించేస్తున్నాడు..

కశ్మీర్‌ ప్రత్యేక హోదా..
ఆర్టికల్‌ 370, 35ఏ అమలు నిర్ణయంతో కశ్మీర్‌ ప్రాంతం స్వయం ప్రతిపత్తి పొందినా, దీని వల్ల దేశ సర్వస్వాధీనత సవాలు ఎదుర్కొంది. ఈ నిర్ణయం వేర్పాటువాద శక్తులకు చట్టపరమైన ఆధారం ఇచ్చి దశాబ్దాలుగా భారత్‌ అంతర్గత భద్రతను కుదిపింది.

బలూచిస్తాన్‌ నిరాకరణ..
1947లో బలూచ్‌ రాజు భారత్‌లో విలీనానికి ఆసక్తి చూపినప్పటికి అంగీకారం నెహ్రూ తిరస్కరించారు. ఫలితంగా పాకిస్తాన్‌ సైన్యం ఆ ప్రాంతాన్ని ఆక్రమించి, ఇప్పుడు చైనా–పాక్‌ వ్యూహకూటంలో కీలక కేంద్రంగా మార్చింది.

కబో వ్యాలీ, కోకో దీవులు దానం..
మయన్మార్‌తో ‘‘స్నేహం’’ పేరుతో నెహ్రూ బర్మాకు కబో వ్యాలీ, కోకో దీవులను ఇచ్చారు. అయితే ఆ తర్వాత అవే ప్రదేశాలు చైనా పర్యవేక్షణలోకి వెళ్లి, భారత భద్రతా వ్యవస్థపై నేరుగా నిఘా స్థావరాలుగా మారాయి.

యూఎన్‌ శాశ్వత సభ్యత్వం..
1950ల్లో భారత్‌కు లభించిన భద్రతా మండలి అవకాశాన్ని నెహ్రూ తిరస్కరించి చైనాకు మద్దతు ఇచ్చారు. దీని ఫలితంగా చైనా నేడు గ్లోబల్‌ పాలిటిక్స్‌లో శక్తిమంతమైన స్థానంలో ఉంది, భారత్‌ మాత్రం ఇంకా ఆ స్థానానికి కాంక్షిస్తూనే ఉంది.

గ్వాదర్‌ పోర్టు వదులుకుని..
ఒమన్‌ అప్పట్లో భారత్‌కి గ్వాదర్‌ పోర్టును ఇవ్వాలనుకున్నా, నిరాకరించడంతో పాకిస్తాన్‌ దానిని స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు అదే ప్రదేశం చైనా–పాక్‌ కారిడార్‌లో కీలక స్ట్రాటెజిక్‌ బిందువుగా ఉంది.

అణుశక్తి అవకాశాన్ని వదులుకోవడం
కెన్నడీ ఇచ్చిన అణుశక్తి సహకార ఆఫర్‌ నిరాకరణ భారత రక్షణ శక్తివద్ధిని దశాబ్దాలు వెనక్కి నెట్టింది. అదే సమయంలో చైనా అణుశక్తిని సాధించి వ్యూహాత్మక ఆధిక్యం పొందింది.

సిందూ నీటి ఒప్పందం..
1960లో సిందూ ఒప్పందం ద్వారా పాకిస్తాన్‌కు అధిక నీటి వాటా ఇచ్చి భారత్‌ తన భవిష్య నీటి స్వయం సమృద్ధిపై ఇబ్బందులు తెచ్చుకుంది. ఈ ఒప్పందం నేటికీ వ్యూహాత్మకంగా భారత్‌ను నీటి దౌత్యంలో బలహీనంగా ఉంచుతోంది.

నెహ్రూ నిర్ణయాలు దేశ విదేశాంగ దిశను నిర్వచించాయి.. కానీ అనేక సందర్భాల్లో భావోద్వేగం, ఆశావాదం దేశ ప్రయోజనాలపై పైచేయి సాధించింది. కాలమానసక దష్టి లేకపోతే ఎంత గొప్ప నిర్ణయం అయినా భవిష్యత్తులో భారమవుతుందనే పాఠం నెహ్రూ యుగం మనకు శాశ్వతంగా గుర్తుచేస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version