Janasena vs BJP : జనసేన – బీజేపీ బంధాలు ఎందుకు అతుకుల బొంతలాగా ఉన్నాయి?

ఎంకిపెల్లి సుబ్బి చావుకొచ్చింది అన్నట్టుగా తయారయింది రాష్ట్రంలోని బిజెపి – జనసేన పొత్తు పరిస్థితి. గత మూడేళ్లుగా రాష్ట్రంలో బిజెపి – జనసేన పొత్తుల కొనసాగుతున్నాయి. పేరుకే పొత్తులో ఉన్న ఈ రెండు పార్టీలు ఎప్పుడో పొట్టి ధర్మాన్ని పాటించినట్లు బయటకు కనిపించిన దాఖలాలు లేవు. ఈ రెండు పార్టీలు ఉమ్మడిగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడిన సందర్భాలు కనిపించవు. కానీ బిజెపి – జనసేన పొత్తులోనే ఉన్నాయన్న వ్యాఖ్యలు ఇరు పార్టీల నుంచి వినిపిస్తుంటాయి. […]

Written By: NARESH, Updated On : March 23, 2023 10:08 pm
Follow us on

ఎంకిపెల్లి సుబ్బి చావుకొచ్చింది అన్నట్టుగా తయారయింది రాష్ట్రంలోని బిజెపి – జనసేన పొత్తు పరిస్థితి. గత మూడేళ్లుగా రాష్ట్రంలో బిజెపి – జనసేన పొత్తుల కొనసాగుతున్నాయి. పేరుకే పొత్తులో ఉన్న ఈ రెండు పార్టీలు ఎప్పుడో పొట్టి ధర్మాన్ని పాటించినట్లు బయటకు కనిపించిన దాఖలాలు లేవు. ఈ రెండు పార్టీలు ఉమ్మడిగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడిన సందర్భాలు కనిపించవు. కానీ బిజెపి – జనసేన పొత్తులోనే ఉన్నాయన్న వ్యాఖ్యలు ఇరు పార్టీల నుంచి వినిపిస్తుంటాయి. అయితే, ఈ పొత్తుపై తాజాగా బిజెపి నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బిజెపి నుంచి పోటీ చేసి సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన పివిఎన్ మాధవ్ జనసేన – బిజెపి పొత్తుపై కాస్త భిన్నమైన కామెంట్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి ఘోర పరాభవాన్ని చూడడంతో పార్టీ నేతలు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అమరావతిలోని పార్టీ కార్యాలయంలో పదాధికారుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఈ రెండు పార్టీల పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనతో తమ పొత్తు పేరుకు మాత్రమే ఉందని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా తమకు ఓటు వేయమని జనసేన ఎక్కడా చెప్పలేదని మాధవ పేర్కొన్నారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని మాత్రమే చెప్పిన జనసేన, బిజెపికి ఓటు వేయాలని చెప్పకపోవడం గమనార్హమని పేర్కొన్నారు. జనసేన తమకే మద్దతిస్తుందని పిడిఎఫ్ సోషల్ మీడియాలో ప్రచారం చేసిన విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లిన స్పందించలేదని ఆయుర్వేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం నిర్వహించిన పెట్టుబడుల సదస్సుకు కేంద్ర మంత్రులు హాజరు కావడం కూడా తమ కొంపముంచిందని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి వైసిపి కలిసి వెళుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మడం వల్లనే తమకు ఓట్లు వేయలేదని, వైసిపి వ్యతిరేక ఓటు అంతా తెలుగుదేశం పార్టీకి పడిందని ఆయన పేర్కొన్నారు. తాజా బిజెపి నాయకుల వ్యాఖ్యలు నేపథ్యంలో రెండు పార్టీల మధ్య పొత్తు మరోసారి చర్చనీయాంశంగా మారింది.

జనసేన – బీజేపీ బంధాలు ఎందుకు అతుకుల బొంతలాగా ఉన్నాయనే దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు..