Pawan Kalyan- Chandrababu: ఏపీ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వేగంగా రాజకీయాలు మారుతున్నాయి. ఢిల్లీకి పవన్ కళ్యాణ్ వెళ్లడం సంచలనమైంది. విశాఖలో పవన్ కళ్యాణ్ ను నిర్బంధించాక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చి మరీ కలిసి పవన్ కు సంఘీభావం తెలిపారు. ఈక్రమంలోనే ఏపీలో ప్రతిపక్షాలు కలిసి పోటీచేస్తే ఏపీ రాజకీయమే మారిపోతుంది. కానీ జనసేనాని పవన్ మాత్రం తన అస్తిత్వం కోసం మూడో ప్రత్యామ్మాయంగా ఎదగాలని చూస్తున్నారు. మరి ఈ మూడు పార్టీలు కలుస్తాయా? ఏం జరగబోతోందన్నది ఆసక్తి రేపుతోంది.

చంద్రబాబు చొరవ చూపితే.. జనసేన టీడీపీ పొత్తు కుదిరితే మాత్రం ఏపీలో క్లీన్ స్వీప్ కావడం ఖాయం అంటున్నారు. వీరికి బీజేపీ కూడా జతకడితే కేంద్రంలోనూ ఈ కూటమి చక్రం తిప్పవచ్చని యోచిస్తున్నారు.
ఏపీలో చంద్రబాబు సీఎం అయితే కేంద్రంలో పవన్ కళ్యాణ్ కు కీలక బాధ్యతలు అప్పజెప్పుతారని.. ఏపీ ఎంపీ సీట్లతో కేంద్రంలో బీజేపీ నిలబడుతుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కు అధికారంపై ఆశ లేకపోవడంతో ఆయన ఏ పదవి ఇచ్చినా తీసుకుంటారని అంటున్నారు. అయితే సీఎం సీటునే పవన్ కు ఇవ్వాలని జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇక ఈ మూడు పార్టీలు కనుక పోటీ చేసి పొత్తు పెట్టుకుంటే మాత్రం జగన్ కు ఇబ్బందులు తప్పవని అంటున్నారు.

జగన్ చేతిలో ఇప్పటికే చంద్రబాబు,పవన్ లు బాధితులు.. జనసేన+టీడీపీతో బీజేపీ కలిస్తే మాత్రం జగన్ ను ఓ ఆట ఆడుకోవడం ఖాయమని.. పవన్, చంద్రబాబులు జగన్ ను జైలుకు పంపేలా బీజేపీపై ఒత్తిడి తేవచ్చని.. పాత కేసులన్నీ తిరగదోడి మరీ జగన్ కు చుక్కలు చూపించే అవకాశం ఉంటుందని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు.