Homeఆంధ్రప్రదేశ్‌బ్లాక్ ష‌ర్ట్ తో పవ‌ర్ ఫుల్ గా.. ఏపీలో దిగిన‌ జ‌న‌సేనాని

బ్లాక్ ష‌ర్ట్ తో పవ‌ర్ ఫుల్ గా.. ఏపీలో దిగిన‌ జ‌న‌సేనాని

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ళ్లీ రాజకీయాల్లో బిజీ అయ్యారు. సుదీర్ఘ విరామం హైద‌రాబాద్ నుంచి ఏపీకి వెళ్లిన ప‌వ‌న్‌.. ప‌వ‌ర్ ఫుల్ గా క‌నిపించారు. బ్లాక్ ష‌ర్ట్ తో గ‌తంలో క‌న్నా ఫుల్ యాక్టివ్ గా, ఎన‌ర్జిటిక్ గా ఉన్నారు. తిరుప‌తి ఉప ఎన్నిక స‌మ‌యంలో క‌రోనా బారిన ప‌డిన ప‌వ‌న్‌.. చాలా రోజులు ఆసుప‌త్రిలో చికిత్స పొందిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత‌.. కోలుకున్న‌ప్ప‌టికీ.. ఇంటికే ప‌రిమితం అయ్యారు. ఆరోగ్యం పూర్తిగా సెట్ అయ్యేంత వ‌ర‌కు విశ్రాంతి తీసుకున్న ప‌వ‌న్‌.. విజ‌య‌వాడ చేరుకున్నారు. అక్క‌డి నుంచి మంగ‌ళ‌గిరి కార్యాల‌యానికి వెళ్లారు.

ఇవాళ‌ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్నారు. తొలుత‌ మంగ‌ళ‌గిరి పార్టీ కార్యాల‌యంలో పొలిటిక‌ల్ అఫైర్స్ క‌మిటీతో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ భేటీ కానున్నారు. ఆ స‌మావేశం త‌ర్వాత నిరుద్యోగ యువ‌త‌తో స‌మావేశం అవుతారు. వారి స‌మ‌స్య‌ల‌ను నేరుగా అడిగి తెలుసుకున్న త‌ర్వాత‌.. దీనిపై పోరాటానికి కార్యాచ‌ర‌ణ సిద్ధం చేస్తారు. అనంత‌రం భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌తోనూ ప‌వ‌న్ స‌మావేశం నిర్వ‌హిస్తారు.

ప్ర‌ధానంగా నిరుద్యోగ స‌మ‌స్య‌పై పార్టీ దృష్టిపెట్ట‌నున్నారు. ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జాబ్ క్యాలెండ‌ర్ పై యువ‌త‌లో నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది. గ్రూప్స్ పోస్టులు కేవ‌లం 33 ఉండ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో సెటైర్లు కూడా పేలుతున్నాయి. దీనిపై పార్టీప‌రంగా జ‌న‌సేన ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది జాబ్ క్యాలెండ‌ర్ కాద‌ని, జాబ్ లెస్ క్యాలెండ‌ర్ అని ఎద్దేవా చేసింది.

ఈ విష‌యంలో పోరాటం సాగించేందుకు పార్టీ శ్రేణుల‌కు ఒక రోడ్ మ్యాప్ కూడా ప‌వ‌న్ అందిస్తార‌ని తెలుస్తోంది. దీంతోపాటు మ‌రిన్ని అంశాల‌పైనా ప్ర‌భుత్వం యుద్ధం ప్ర‌క‌టించ‌బోతున్నారు ప‌వ‌న్‌. గ‌డిచిన మూడు నెల‌ల్లో ప్ర‌జ‌ల నుంచి ఎన్నో అర్జీలు వ‌చ్చాయ‌ట‌. అవ‌న్నీ ప‌వ‌న్ ప‌రిశీలించి, ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోరాటం సాగించేందుకు అంశాల‌ను కూడా ఎంచుకుంటార‌ని తెలుస్తోంది.

క‌రోనా సోకిన‌ త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్.. జ‌న‌సేన‌ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు సైతం అందుబాటులోకి రాలేదు. ఎలాంటి రాజ‌కీయంగా వ్యాఖ్యానాలూ చేయ‌లేదు. అయితే.. కాస్త లేటుగా వ‌చ్చినా.. లేటెస్ట్ గా క‌నిపిస్తున్నారు జ‌న‌సేనాని. బ్లాక్ ష‌ర్ట్ లో ప‌వ‌ర్ ఫుల్ లుక్ లో ద‌ర్శ‌న‌మిచ్చారు. న‌ల్ల క‌ల‌రు అనేది నిర‌స‌న‌కు గుర్తు అన్న సంగ‌తి తెలిసిందే. ఈ డ్రెస్ లో ఏపీలో దిగ‌డం ద్వారా.. రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఇక స‌మ‌ర‌భేరి మోగించ‌నున్న‌ట్టు సింబాలిక్ గా చెప్పేశారు ప‌వ‌ర్ స్టార్‌. మరి, మున్ముందు ఎలాంటి కార్య‌క్ర‌మాలు తీసుకొని ప్ర‌జ‌ల్లోకి వెళ్తారో చూడాలి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular