Pawan Kalyan: జనసేన మరో పోరాటం.. ఉద్యోగులకు అండగా పవన్.. జగన్ కు మరో పోటు

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో ఇన్నాళ్లు తమకు ప్రతిపక్షాల బెడద లేదనుకున్న వైసీపీకి జనసేన కంట్లో నలుసుగా మారుతోంది. గత కొన్ని నెలలుగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై పోరాడుతూ అటు ప్రజలకు దగ్గరవుతోంది. మరోవైపు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోంది. ఆ మధ్య శ్రమదానం పేరిట రోడ్లను తామే బాగు చేసుకుంటామని కొందరు జనసైనికులు తమ సొంత ఖర్చులతో రోడ్లను బాగు చేసుకున్నారు. దీంతో ప్రభుత్వం దిగి వచ్చి రోడ్లను బాగుచేస్తోంది. దీంతో జనసేన అప్పటి […]

Written By: NARESH, Updated On : November 9, 2021 10:42 am
Follow us on

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో ఇన్నాళ్లు తమకు ప్రతిపక్షాల బెడద లేదనుకున్న వైసీపీకి జనసేన కంట్లో నలుసుగా మారుతోంది. గత కొన్ని నెలలుగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై పోరాడుతూ అటు ప్రజలకు దగ్గరవుతోంది. మరోవైపు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోంది. ఆ మధ్య శ్రమదానం పేరిట రోడ్లను తామే బాగు చేసుకుంటామని కొందరు జనసైనికులు తమ సొంత ఖర్చులతో రోడ్లను బాగు చేసుకున్నారు. దీంతో ప్రభుత్వం దిగి వచ్చి రోడ్లను బాగుచేస్తోంది. దీంతో జనసేన అప్పటి నుంచి దూకుడు పెంచింది. ప్రజా సమస్యను ఒక్కొక్కటిగా తీసుకుంటూ వాటిపై పోరాటం చేస్తోంది. నిన్నటివరకు జనసేన అధినేత పవన్ విశాఖలో పర్యటించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. వారం రోజుల్లోగా ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి తెలపాలని డెడ్ లైన్ విధించారు. ఇక తాజాగా ఆయన టీటీడీ కాంట్రాక్టు ఉద్యోగుల తరుపున పోరాటం చేయనున్నారు.

pawan kalyan tirumala

తిరుమల తిరుపది దేవస్థానంలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని, ఎన్నో ఏళ్లుగా వారు పనిచేస్తున్నా రెగ్యులరైజ్ చేయడం లేదని పవన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. వెంటనే వారి విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన తిరుపతిలో పర్యటించేందుకు ప్లాన్ వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ ప్రకటనను జనసేన అధినేత సోమవారం జారీ చేశారు. 2010లో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు 4 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను నియమించుకుంది. వారిని సొసైటీలుగా ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం కార్పొరేషన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అంటున్నారు.

వ్యవస్థలను మార్చేటప్పుడు ప్రభుత్వం జాగ్రత్తగా వ్వహరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని విమర్శించారు. ఇసుక పాలసీ విధానంతో సామాన్యులకు ఇసుక లభించడం లేదన్నారు. దీంతో గృహాలు నిర్మించుకునేవారు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన చెందారు. ఇక ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలను మూసివేసేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో ఎంతో మంది విద్యార్థులకు కార్పొరేట్ విద్య దూరం కానుందని, ఇందులో పనిచేసే ఉద్యోగులు రోడ్డున పడనున్నారని అన్నారు.

తాజాగా టీటీడీ కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం సహేతుకమైంది కాదని అన్నారు. ఒకే పనిచేస్తున్న కాంట్రాక్టు, రెగ్యులర్ ఉద్యోగుల మధ్య వేతనాల్లో తేడాలు ఎందుకు ఉంటాయని ప్రశ్నించారు. 2016లో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఈ విషయంలో ఇచ్చిన తీర్పు మీకు తెలియదా..? అని ప్రశ్నించారు. టీటీడీ కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం కార్పొరేషన్ లో ఉండాలని చెబితే.. అందులో లేని వారు ఉద్యోగాలు కోల్పోవాల్సి ఉంటుందన్నారు. దీంతో వారి జీవితాలు ఆగమయ్యే పరిస్థితి వస్తుందన్నారు. ప్రభుత్వం నిధులు దారి మళ్లించేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని, ఇప్పటికైనా నిర్ణయాన్నిమార్చుకోవాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించారని అన్నారు. అయితే టీటీడీ కాంట్రాక్టు ఉద్యోగుల తరుపున జనసేన పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు.