AP MPTC, ZPTC Elections: పవన్ కళ్యాణ్ వైపు ప్రజల దృష్టి మళ్లిందా?

AP MPTC, ZPTC Elections: ‘‘ఒక్కన్నే వస్తా.. ఒక్కడినే వస్తా’’ అంటూ ‘జనసేన’తో రాజకీయం ఆరంభించిన పవన్ కళ్యాణ్.. తన టార్గెట్ సీఎం పీఠం కాదని పార్టీ పెట్టినప్పుడే ప్రకటించాడు. తనది 25 ఏళ్ల రాజకీయ ప్రణాళిక అని.. అప్పటివరకూ రాజకీయాల్లో ప్రజల తరుఫున పోరాడుతూనే ఉంటానన్నారు. ఈ క్రమంలోనే వెన్నుచూపకుండా ఏపీలో రాజకీయం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వెలువడిన ఏపీ పరిషత్ ఎన్నికల ఫలితాలు మనకు రాబోయే భవిష్యత్ కు సంకేతంగా మనం భావించొచ్చు. అందరూ […]

Written By: NARESH, Updated On : September 20, 2021 6:18 pm
Follow us on

AP MPTC, ZPTC Elections: ‘‘ఒక్కన్నే వస్తా.. ఒక్కడినే వస్తా’’ అంటూ ‘జనసేన’తో రాజకీయం ఆరంభించిన పవన్ కళ్యాణ్.. తన టార్గెట్ సీఎం పీఠం కాదని పార్టీ పెట్టినప్పుడే ప్రకటించాడు. తనది 25 ఏళ్ల రాజకీయ ప్రణాళిక అని.. అప్పటివరకూ రాజకీయాల్లో ప్రజల తరుఫున పోరాడుతూనే ఉంటానన్నారు. ఈ క్రమంలోనే వెన్నుచూపకుండా ఏపీలో రాజకీయం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో వెలువడిన ఏపీ పరిషత్ ఎన్నికల ఫలితాలు మనకు రాబోయే భవిష్యత్ కు సంకేతంగా మనం భావించొచ్చు. అందరూ భావించినట్టుగానే అధికార వైసీపీకి తిరుగులేదు. రాజకీయాలపై కనీస అవగాహన ఉన్న వారు ఎవరికైనా సరే ఏపీలో వైసీపీ ఓటు బ్యాంక్ పటిష్టంగా ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతోంది. అదే ఫలితాల్లో పునరావృతమైంది.

ఏపీ పరిషత్ ఎన్నికల్లో ఇంత వన్ సైడ్ గా ఫలితాలు వస్తాయని ఎవ్వరూ ఊహించలేదు. అసలు ప్రతిపక్షం అనేదే లేకుండా ఫలితాలు వెలువడడం అందరినీ విస్మయానికి గురిచేసింది. అయితే ఈ ఫలితాల్లో ట్విస్ట్ ఏంటంటే.. పరిషత్ ఎన్నికలపై జనసేన పార్టీ కోర్టుకు ఎక్కి.. తిరిగి నామినేషన్లు స్వీకరించాలని.. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని పోరాడింది. అదే జరిగితే ఫలితాలు ఇప్పటికన్నా భిన్నంగా ఉండేవనేది రాజకీయ విశ్లేషకుల అంచనా..

ఈ ఫలితాల్లో టీడీపీ ఇంత దారుణంగా పడిపోవడం.. అధికార వైసీపీకి ఎక్కడ పోటీనిచ్చేలా కనిపించకపోవడమే అందరినీ షాక్ కు గురిచేస్తోంది. టీడీపీకి ఏడు జిల్లాల్లో ఒక్క జడ్పీటీసీ స్థానం రాలేదు. టీడీపీ అనేది ఆంధ్రలో పూర్తిగా దెబ్బతిన్నదన్నది వాస్తవం. ప్రజల్లో టీడీపీ మీద క్రెడిబిలిటీ లేకుండా పోతోంది. దీంట్లో ప్రజలకు ఆశాదీపంగా కనిపిస్తున్న పార్టీ జనసేన. ఇప్పటికిప్పుడు ప్రతిపక్షంగా ఎదగకున్నా ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం తన ఉనికిని జనసేన చాటుకుంది. ఆల్ మోస్ట్ టీడీపీకి సమాన స్థాయిలో జనసేనకు ఎంపీటీసీ స్థానాలు రావడం విశేషం. ఇక జడ్పీటీసీ స్థానాలు కూడా కైవసం చేసుకుంది.

ఏపీలో జనసేనకు సీట్లు రావడం ఖచ్చితంగా మూడో ప్రత్యామ్మాయానికి సంకేతం.. జనసేనకు ఈ విజయం భవిష్యత్ రాజకీయాలను మార్చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో జనసేన గెలుపు.. ఏపీ రాజకీయాలను ఎలా మారుస్తుందనే దానిపై ‘రామ్ టాక్’ స్పెషల్ వీడియో మీకోసం..