Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan CM Candidate Issue: పవన్ సీఎం క్యాండిడేట్ లొల్లి: జనసేన, బీజేపీ మధ్య...

Pawan Kalyan CM Candidate Issue: పవన్ సీఎం క్యాండిడేట్ లొల్లి: జనసేన, బీజేపీ మధ్య దూరం పెరుగుతుందా?

Pawan Kalyan CM Candidate Issue: నాడు పెద్దన్న పాత్ర పోషిస్తామన్నారు. నీకేందుకు మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. తీరా ఇప్పుడు కాదంటున్నారు. కాదు కుదరదని తేల్చిచెబుతున్నారు కమలనాథులు. తామే కోరికను పుట్టించారు. ఇప్పుడు తామే తుంచేసి నిజమైన రాజకీయంతో రక్తికట్టిస్తున్నారు. అయితే ఇందులో నలిగిపోయింది.. నష్టపోయింది మాత్రం జనసేనాని పవన్ కల్యాణ్. బీజేపీ ఫక్తు రాజకీయాన్ని నమ్మి మోసపోయారు జనసేనాని.పవన్ తోనే మాకు పొత్తు. పవన్ మా రెండు పార్టీలకు ఉమ్మడి అభ్యర్ధి అని నాడు గట్టిగా చెప్పుకొచ్చారు బీజేపీ వారు. మరి ఎందుకు చెప్పారు? పవన్ తో మాట్లాడి చెప్పారా? తమ ఢిల్లీ పెద్దలను సంప్రదించి చెప్పారా? అంటే ఏమో వారికే స్పష్టత లేదు. అలా వారు ప్రకటించిన తరువాతనే జన సైనికులలో నమ్మకం అమాంతం పెరిగింది. ఏపీలో రాజ్యాధికారం తమదేనన్నంత ధీమా వచ్చింది. వెనుకున్నది బీజేపీ. అందునా దేశ రాజకీయాలను శాసిస్తున్న పార్టీ. మోడీ అమిత్ షా బ్రాండ్ ఇమేజ్ ఉన్న పార్టీ. అలాంటి పార్టీ ఉమ్మడి సీఎం అభ్యర్ధి పవన్ అంటే రాజకీయంగా బలం చేకూర్చే అంశం గానే చూడాలి కదా. ఇదే అడ్వాంటేజ్ గా తీసుకుని జనసేన రాజకీయ బేరాలకు ఇపుడు రెడీ అయింది. అందుకే ఈ మధ్యన మంగళగిరిలో జరిగిన సమావేశంలో పవన్ మాట్లాడుతూ ఇంతకాలం మేము తగ్గాం ఇక తగ్గమని చెప్పారు. అంటే అధికారంలో వాటా కావాలని సీఎం పోస్ట్ లో వాటా కావాలని కచ్చితంగా కోరడమే. బీజేపీ లాంటి జాతీయ పార్టీ దన్ను ఉందనో.. ఆ పార్టీయే తనను ప్రతిపాదించిందని భావించో.. టీడీపీ లాంటి ప్రాంతీయ పార్టీకి ఏమైనా అభ్యంతరం ఎందుకు ఉండాలన్న వైఖరితోనే పవన్ అలా బిగ్ సౌండ్ చేశారు అనుకోవాలి. అయితే ఈ విషయంలో టీడీపీ దిగువ క్యాడర్ ధీటైన జవాబు ఇచ్చినా అధినాయకత్వం మాత్రం సైలెంట్ గానే ఉంది.ఒక విధంగా మల్లగుల్లాలు పడుతోంది.

Pawan Kalyan CM Candidate Issue
jp nadda, pawan kalyan

టీడీపీ నెత్తిన పాలు..
ప్రస్తుతానికి అయితే టీడీపీకి పొత్తు అవసరం. కానీ కొత్తగా జనసేన నుంచి వస్తున్న డిమాండ్లు చూసి టీడీపీ పెద్దల బుర్రలు బొప్పి కట్టాయి. ముందుకెళ్లాలో వారి తెలియదు. అటువంటి కరెక్ట్ సమయంలో బీజేపీయే మందు అందించి టీడీపీ పెద్దల తలనొప్పిని తగ్గించింది. అదేంటి అంటే ఉమ్మడి సీఎం అభ్యర్ధి పేరుని తాము ఇపుడు ప్రకటించమని ఎన్నికల తరువాతనే అంటూ బీజేపీ నాయకులు తాజాగా చెప్పడం జనసేనకు దెబ్బగా ఉంటే టీడీపీ నెత్తిన పాలు పోసినట్లు అయింది.నిజానికి బీజేపీ నాయకులు ఈ సమయంలో అలాంటి ప్రకటన ఇవ్వనవసరం లేదు జనసేనలో కొందరు కీలకనాయకులే దాన్ని కెలికి ఇరవై నాలుగు గంటలలోగా ఏపిలో టూర్ చేస్తున్న బీజేపీ జాతీయ పెద్ద జేపీ నడ్డా చేత ఉమ్మడి సీఎం అభ్యర్ధి పవన్ అని చెప్పించాలని డిమాండ్ చేయడం అల్టిమేటం జారీ చేయడంతోనే కమలానికి కాలి అలా నేతల నోట ఆ మాట వచ్చిందన్న మాట.

Also Read: BJP Alliance With Janasena: జనసేనతో పొత్తుపై బీజేపీ పీచేముడ్.. అసలు స్టాండ్ ఏంటి? ఏం చేయనుంది?

లేకపోతే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల వేళ చెప్పిన మాట ప్రకారమే ఉమ్మడి సీఎం అభ్యర్ధిగా పవన్ అని అలా ప్రచారంలో ఈ రోజుకీ నానుతూనే వచ్చేది. ఇదంతా జనసేన నాయకులు కొందరు తాముగా చేసుకున్న పుణ్యమే. ఇలా కోరి మరీ కెలికి బీజేపీ నుంచి క్లారిటీ తెచ్చేసుకున్న తరువాత జనసేన పరువు నిజంగా టీడీపీ ముందు పోయేలా చేసుకున్నారు.

jp nadda, pawan kalyan
jp nadda, pawan kalyan

వారే ఒప్పుకోకపోతే..
వాస్తవాని ఏపీలో బీజేపీ బలం అంతంతమాత్రం. నాలుగు శాతానికి కూడా దాటి వెళ్లలేని స్థితిలో ఉంది. అటువంటి పార్టీయే తమ ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ఒప్పుకోకుంటే… బలమైన ప్రతిపక్షంగా 30 నుంచి 40 శాతం ఓటు బ్యాంకు ఉన్న తామెలా ఒప్పుకుంటామని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. అంటే పవన్ మంగళగిరిలో చెప్పిన ఆప్షన్స్ పెట్టిన కండిషన్లకు కొద్ది రోజుల వ్యవధిలోనే వ్యూహాత్మకమైన జవాబు దొరికేసింది అన్న మాట. ఇదంతా పవన్ రాజకీయంగా వేసిన తప్పుడు ఎత్తుగడగానే అంటున్నారు. ఆయన గుప్పిట తెరిచేసి తన వ్యూహాలు చెప్పేసి కాని కాలంలో రాంగ్ టైమ్ లో వాటిని బయటపెట్టుకోవడం వల్లనే ఇలా జరిగింది అన్న విశ్లేషణలు ఉన్నాయి. మొత్తానికి రెండున్నర ఏళ్ళ స్నేహానికి బీజేపీ పవన్ కి ఏమి చేసింది అంటే కీలక సమయంలో టీడీపీతో బేరమాడే శక్తిని కూడా తగ్గించేసింది అని అంటున్నారు. అయితే ఇదంతా జనసేన స్వయంకృతమని కూడా అనే వారు ఉన్నారు. మరి దీన్ని మించిన ఎత్తుగడ ఏమైనా వేసి జనసేన బయటకు వస్తుందేమో చూడాలి మరీ.

Also Read:Mrigasira Karthi: నేడే మృగశిర.. ఈ కార్తె ప్రాముఖ్యత ఏమిటీ? ఆ పేరు ఎందుకొచ్చింది?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular