https://oktelugu.com/

Pawan Kalyan: రాష్ట్ర భవిష్యత్ ను పవన్ కళ్యాణ్ నిర్ధేశించబోతున్నారా?

Pawan Kalyan: ఏపీ భవిష్యత్ నిర్ధేశించేదే జనసేన సభ అని పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ఆదివారం జనసేన కార్యాలయం నుంచి ఆయన ఏపీ ప్రజలకు దిశానిర్ధేశం చేశారు. సోమవారం తాడేపల్లి సమీపంలోని ఇప్పటం గ్రామంలో నిర్వహించనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను పవన్ కళ్యాన్ చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇప్పటం సభ రెగ్యులర్ గా నిర్వహించే సభల్లాంటిది కాదని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ ను నిర్ధేశించే సభగా […]

Written By:
  • NARESH
  • , Updated On : March 13, 2022 / 06:32 PM IST
    Follow us on

    Pawan Kalyan: ఏపీ భవిష్యత్ నిర్ధేశించేదే జనసేన సభ అని పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ఆదివారం జనసేన కార్యాలయం నుంచి ఆయన ఏపీ ప్రజలకు దిశానిర్ధేశం చేశారు. సోమవారం తాడేపల్లి సమీపంలోని ఇప్పటం గ్రామంలో నిర్వహించనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను పవన్ కళ్యాన్ చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇప్పటం సభ రెగ్యులర్ గా నిర్వహించే సభల్లాంటిది కాదని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ ను నిర్ధేశించే సభగా పవన్ కళ్యాణ్ దీన్ని అభివర్ణించారు.

    Pawan Kalyan

    జనసేనాని ఆవిర్భావ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు అర్థమవుతోంది. భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను దిశానిర్ధేశం చేస్తున్నట్లుగా ప్రకటించారు. గత రెండున్నరేళ్లలో ఏం జరిగింది.? భవిష్యత్ ఎలా ఉండబోతోందో ప్రసంగిస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. దీంతో ఏపీ రాజకీయాలను షేక్ చేసేలా పవన్ కళ్యాణ్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.

    Also Read: MLC Kavitha: చార్మినార్‌పై క‌విత బ‌ర్త్ డే ఫ్లెక్సీ వివాదం.. ఆ ఏరియా అధ్య‌క్షుడిపై కేసు..

    జనసేన 9వ ఏట అడుగుపెడుతున్నందున అందరూ రావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వీర మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. సభకు వచ్చినా దూరంగా ఉండిపోయేవారికి ప్రత్యేకంగా ఎల్.ఈడీ తెరలు ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు. సభా ప్రాంగణానికి దామోదం సంజీవయ్య చైతన్య వేదిక అనే పేరు పెట్టారు. ఇప్పటికే జనసేన కమిటీలు ఏర్పాటు చేసి అక్కడ విస్తృతంగా పనులు పూర్తి చేస్తున్నారు. సభా వేదిక పనులు దాదాపుగా పూర్తయ్యాయి.

    ఈ సభ అలాంటి ఇలాంటి సభ కాదంటూ పవన్ చెప్పడంతో రేపు ఏం ప్రసంగిస్తారు? ఎలాంటి బాంబులు పేల్చుతారన్నది ఉత్కంఠగా మారింది. ప్రసంగం ధాటిగా.. వాడివేడిగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడడం ఖాయంగా కనిపిస్తోంది.

    Also Read: Caste Conspiracy Against Janasena Party : జనసేనపై కులం కుట్ర మొదలైందా?

    ప్రభుత్వం తీరుపై తీవ్ర అసహనంతో ఉన్న జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున సభా ప్రాంగణానికి తరలివచ్చే అవకాశం ఉంది. టీడీపీ హయాంలోనూ చంద్రబాబు పాలన చివరి రోజుల్లో పవన్ కళ్యాణ్ నాడు టీడీపీ పాలనను కడిగిపారేశారు. ఈ సారి ముందస్తు ఎన్నికల ప్రచారం కారణంగానే పవన్ ఈ ఏడాది నుంచే ప్రభుత్వంపై ఫైట్ చేయడానికి డిసైడ్ అయ్యాడని.. ఈ సభా వేదిక నుంచే తన ప్రణాళికలు వివరిస్తాడని తెలుస్తోంది.