Pawan kalyan: తెలంగాణ గొప్పతనం.. తనకు ఎదురుదెబ్బలపై పవన్ కీలక వ్యాఖ్యలు

Pawan kalyan: పవన్ కళ్యాణ్ మరోసారి తన అంతరంగాన్ని ఆవిష్కరించాడు. తెలంగాణ జనసేన కార్యకర్తలు, నాయకులతో సమావేశంలో ఇక్కడి భూమి గొప్పతనాన్ని వివరించడమే కాదు.. తనకు తగులుతున్న ఎదురుదెబ్బలపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఇన్నాళ్లు ఏపీ రాష్ట్రాన్నే ఎక్కువగా పట్టించుకున్నారు. కానీ చాలా రోజుల తర్వాత తెలంగాణ కార్యకర్తలు, నేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను దెబ్బకొట్టే కొద్దీ మరింత ఎదుగుతానని పవన్ కళ్యాణ్ […]

Written By: NARESH, Updated On : October 9, 2021 5:58 pm
Follow us on

Pawan kalyan: పవన్ కళ్యాణ్ మరోసారి తన అంతరంగాన్ని ఆవిష్కరించాడు. తెలంగాణ జనసేన కార్యకర్తలు, నాయకులతో సమావేశంలో ఇక్కడి భూమి గొప్పతనాన్ని వివరించడమే కాదు.. తనకు తగులుతున్న ఎదురుదెబ్బలపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఇన్నాళ్లు ఏపీ రాష్ట్రాన్నే ఎక్కువగా పట్టించుకున్నారు. కానీ చాలా రోజుల తర్వాత తెలంగాణ కార్యకర్తలు, నేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

తనను దెబ్బకొట్టే కొద్దీ మరింత ఎదుగుతానని పవన్ కళ్యాణ్ అన్నారు. అన్నింటికి సిద్ధమపడే రాజకీయాల్లోకి వచ్చినట్టు తెలిపారు. ఈ నేల తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. బలమైన సామాజిక మార్పు కోసం ప్రయత్నిస్తానని తెలిపారు. తెలంగాణ ప్రజలు కోరుకున్నప్పుడు తాను ఇక్కడి ప్రజల పక్షాన పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణలోని యువతకు అవకాశాలు కల్పించాలని.. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసే వ్యక్తులు అసెంబ్లీకి వెళితే చూడాలని ఉందని.. తప్పకుండా జనసేన ఆ కలను నిజం చేసి చూపిస్తోందన్నారు.

‘జై తెలంగాణ’ అంటూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ తెలంగాణ పోరాట స్ఫూర్తి తనకు ధైర్యం నింపిందని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లోకి రావడం రిస్క్ అని అంటున్నారు.. ఎందుకు రిస్క్ అంటూ ప్రశ్నించాడు. ఎన్నికల్లో ఓడిపోయినా వెనకడుగు వేసేది లేదని చెప్పారు. అడుగు పడితే తప్ప అనుభవం రాదన్నారు.

తెలంగాణలో ఉన్న గొప్పదనం ఏంటంటే.. 17 ఏళ్ల కుర్రాడు సమస్యపై పోరాడుతారు. ఖమ్మం జిల్లాలోని నల్లమల్ల సమస్యకోసం తన వద్దకు వచ్చిన తీరు ఎప్పటికీ మరిచిపోనని తెలిపాడు. అంత గొప్ప పోరాట స్ఫూర్తి తెలంగాణ సొంతమని కొనియాడారు.

హిందూ దేవాలయాల మీద దాడి జరిగితే ఖండిస్తే దాని వల్ల ఓట్లు పోతాయని తాను అనుకోలేదని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై పడుతున్న హిందుత్వ ముద్రపై భయపడనని కుండబద్దలు కొట్టారు. రాష్ట్ర విభజన వాదాన్ని గౌరవిస్తూ దేశాన్ని ప్రేమించాలని సూచించారు. సమాజంలోని వర్గ శత్రువులపై పోరాడుతానని పవన్ స్పష్టం చేశారు.

-పవన్ కళ్యాణ్ వీడియో