Pawan Kalyan Illness: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్వల్ప అస్వస్థకు గురైనట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా తీరిక లేకుండా ఆయన పర్యటనలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ‘వారాహి యాత్ర’ నిర్వహిస్తున్నారు. వాతావరణ మార్పులతో పాటు తీరిక లేకుండా పర్యటనలు చేయడంతో పవన్ అస్వస్థకు గురయైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ పెద అమిరంలోని ఓ ఫంక్షన్ హాల్ లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఆయన భీమవరం నేతలతో భేటీ కావాల్సి ఉంది. అనారోగ్యానికి గురి కావడంతో ఆ భేటీ వాయిదా పడింది.
ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసేందుకు పవన్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకునేందుకు వారామి యాత్రను నిర్వహిస్తున్నారు. ఈ యాత్రలో ఆయన అధికార వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఒక్కోసారి ఆవేశంగా మాట్లాడుతూ ఎమోషనల్ అవుతున్నారు. ఏపీ రాష్ట్ర భవిష్యత్ బాగుండాలని నిత్యం నినాదాలు చేస్తూ అందుకోసం ఎంత వరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నట్లు పవన్ పదే పదే చెబుతున్నారు.
మొన్నటి వరకు వేసవి ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయిన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అక్కడక్కడా వర్షాలు కురవడంతో చల్లబడింది. దీంతో వాతావరణ మార్పులో చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. ఇందులో భాగంగా పవన్ ఏమాత్రం రెస్ట్ లేకుండా పర్యటనలు చేస్తున్నారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూ.. మరోవైపు రాజకీయాల్లో బిజీ అయిన వపన్ కు కాస్త అనారోగ్యానికి గురి కావడంతో పవన్ అభిమానులు షాక్ తింటున్నారు. అయితే పెద్దగా ప్రమాదం ఏమీ లేదని కాస్త విశ్రాంతి తీసుకుంటే చాలని పవన్ కు చికిత్స చేసిన వైద్యులు పేర్కొనడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.