Actress Somya Seth: ప్రేమ, పెళ్లి, పిల్లలు, విడాకులు.. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకు మాత్రమే పరిమితం అయిపోయేవి. ఇప్పుడు ఇవి మనదేశంలో కూడా సర్వసాధారణమైపోయాయి. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఇవి మరింత సాధారణమైపోయాయి. అయితే విడాకుల తర్వాత మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. సామాన్యులు ఈ పని చేస్తే ఈసడించుకునే సమాజం.. సెలబ్రిటీల విషయంలో మాత్రం ఎంతో ఉత్సాహం చూపిస్తుంది. మీడియా కూడా అలాంటి వాటికే ప్రాధాన్యమిస్తుంది. ఇప్పుడు ఇక ఈ జాబితాలో చేరిపోయింది ప్రముఖ సీరియల్ నటి. మొదటి భర్తతో ఒక కుమారుడు కలిగిన తర్వాత, కాపురంలో కలహాలు చోటుచేసుకుని వారిద్దరూ విడిపోయారు. కొడుకుతో ఒంటరి జీవితం గడుపుతున్న ఆమె మళ్లీ ప్రేమలో పడింది. ఇప్పుడు ఆ కొడుకు సమక్షంలోనే తన ప్రియుడిని పెళ్లాడింది.
పెళ్లి, విడాకులు, పేరెంట్గా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సీరియల్ నటి సౌమ్య ఇటీవల రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించింది. నా ప్రియుడు శుభం చౌహాడియా ను రహస్యంగా రెండవ వివాహం చేసుకుంది..” నా భవిష్యత్తు బాగుండాలని నా తల్లిదండ్రులు కోరుకున్నారు. ఆ జాబితాలో నా కుమారుడు ఐడెన్ కూడా ఉన్నాడు. వారికోసం, రెండవ పెళ్లి చేసుకున్నాను. తనకి శుభం చౌహాడియాతో నేను సంతోషంగా ఉన్నాను. అతడు నా కోసం ఏదైనా చేయగలడు. నా ప్రపంచంలోకి వచ్చిన అతడు, చివరికి నా ప్రపంచం అయిపోయాడు. నా కొడుకు కూడా అతడిని బాగా ఇష్టపడుతున్నాడు. వాళ్ళిద్దరూ చక్కటి ఫ్రెండ్స్ గా ఉంటున్నారు” అని సౌమ్య సేథ్ రాస్కొచ్చింది.
సౌమ్య సేథ్ పేరుపొందిన సీరియల్ నటి. హిందీలోని అనేక సీరియల్స్ లో నటించింది. చాలామంది ప్రేక్షకులకు చేరువైంది. అయితే అమెరికాకు చెందిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతని ద్వారా ఆమెకు ఒక కుమారుడు కలిగాడు. కాపురంలో నెలకొన్న మనస్పర్ధల వల్ల వాళ్ళిద్దరూ విడిపోయారు. ఇదే సమయంలో ఆమె రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ప్రవేశించింది. శుభం చౌహాడియాతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలోనే శుభం చౌహాడియా సౌమ్య సేథ్ కొడుకుకు కూడా దగ్గరయ్యాడు. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ గా మారిపోయారు. దీంతో సౌమ్య చౌహాడియాను వివాహం చేసుకుంది. వారిద్దరిని పెళ్లి గెటప్ లో చూసిన కుమారుడు చాలా సంతోషపడ్డాడు. జూన్ 21న హల్దీ, మెహంది వేడుకలు జరిగాయి. 22న వివాహం జరిగింది. అతి తక్కువ మంది సమక్షంలో ఈ వివాహం జరిగింది.
అతడు ఎవరంటే
శుభం చౌహాడియా .. చిత్తూరు గడ్ ప్రాంతానికి చెందిన ప్రముఖ ఆసుపత్రి వైద్యుడు అంజు చౌహన్ తనయుడు. వాషింగ్టన్ డిసి లో ఇతడు ఆర్కిటెక్ట్ గా పని చేస్తున్నాడు. గత ఐదు సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్న సౌమ్య తన అపార్ట్మెంట్లో ఒక గదిని ఇవ్వాలని నిర్ణయించుకుంది. అదే గదిలోకి శుభం వచ్చి చేరాడు. హౌస్ మేట్ గా, తర్వాత స్నేహితుడిగా మారాడు. కోవిడ్ సమయంలో వారిద్దరూ బాగా దగ్గరయ్యారు. అతడు తన జీవితంలోకి వస్తే మరింత అందంగా మారుతుందని భావించిన సౌమ్య..ప్రపోజ్ చేసింది. దీనికి అతడు ఒప్పుకున్నాడు. వారిద్దరి పెళ్ళికి తల్లిదండ్రులు మాత్రమే కాకుండా, సౌమ్య కుమారుడు కూడా సమ్మతం తెలిపాడు. దీంతో ఇద్దరి వివాహం అత్యంత సింపుల్ గా జరిగింది. ప్రస్తుతం తన వైవాహిక జీవితానికి సంబంధించిన వీడియోలను సౌమ్య సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తోంది. ఆమెకు నెటిజెన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. వైవాహిక జీవితం బాగుండాలని దీవెనలిస్తున్నారు.
View this post on Instagram