Janasena Chief Pawan Kalyan: అమరావతి రైతుల మహా పాదయాత్ర ఉత్తరాంధ్రకు సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. నాన్ పొలిటికల్ జేఏసీలను ఏర్పాటుచేసి రౌంట్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వైసీపీ సానుభూతిపరులతో సభలు నిర్వహించి విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కు మద్దతుగా ప్రకటనలు చేయిస్తున్నారు. పనిలో పనిగా వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా అస్త్రాలను సంధిస్తున్నారు. ప్రజల్లో ప్రాంతీయ వాదం రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు.ఉత్తరాంధ్రకు టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు అన్యాయం చేస్తున్నాయని ప్రచారం చేస్తున్నారు. దీంతో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. మరోవైపు అమరావతి రైతుల మహా పాదయాత్రను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు గర్జిస్తున్నారు. ప్రజల్లో భావోద్వేగాలను రగిల్చే పనిలో పడ్డారు.

ఇటువంటి పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ రియాక్టు అయ్యారు. ఎందుకీ గర్జన అంటూనే ప్రభుత్వ వైఫల్యాలను తనదైన రీతిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో సమస్యలను ప్రస్తావిస్తూనే.. వైసీపీ ప్రజాప్రతినిధులు చేస్తున్న దురాగతాలను దెప్పిపొడిచారు. ఆదివారం రాత్రి ట్విట్టర్ లో తనదైన రీతిలో వైసీపీకి కౌంటర్ ఇచ్చారు. తొలుత దేనికి గర్జనలు? మూడు రాజధానులతో రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేయాటానికా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పినదానికి భిన్నంగా చేస్తున్నందుకా? అని ట్విట్ చేశారు. నాడు అమరావతికి అంత భూమి అవసరం లేదని తాను చెబితే…ఇప్పుడు సేకరించిన 32 వేల ఎకరాలు చాలవని.. మరింత సమీకరించాలని నాడు విపక్ష నేతగా జగన్ అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనను పవన్ ఇప్పుడు గుర్తుచేస్తున్నారు. నాడు అమరావతి రాజధానికి ఒప్పుకొని ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం మూడు రాజధానులను తెరపైకి తేవడాన్ని పవన్ ఆక్షేపించారు.
Also Read: Garikapati – Chiranjeevi Controversy: గరికపాటి – చిరంజీవి వివాదం.. మనకు ఏం నేర్పింది!
దేనికి గర్జనలు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆపలేకపోయినందుకా? మత్స్యకారులకు సొంత తీరంలో వేటకు అవకాశం లేక గోవా, గుజరాత్, చెన్నై వెళ్లిపోతున్నందుకా? అంటూ రెండో ట్విట్ చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ది కోసమే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేస్తున్నట్టు జగన్ అండ్ కో ప్రకటించింది. అయితే ఉత్తరాంధ్ర ప్రజల జీవనోపాధి పెంచడానికి పరిశ్రమలు, ఇతరత్రా స్వయం ఉపాధి పథకాలు ఎందుకు పెట్టలేదని పవన్ ప్రశ్నించారు. పైగా సుదీర్ఘ తీర ప్రాంతం ఉత్తరాంధ్ర సొంతం. మత్స్యకార జనాభా లక్షల్లో ఉన్నారు. వారి కోసం ఫిషింగ్ హార్బర్లు, జెట్టీల నిర్మాణం వంటి ఏవీ చేపట్టలేదు. స్థానికంగా ఉపాధి లేక వేలాది మంది మత్స్యకారులు సుదూర ప్రాంతాలకు వెళుతున్న విషయాన్ని పవన్ గుర్తుచేశారు. ముందు వీరి జీవితాలను బాగుచేసే ప్రయత్నం చేయకుండా రాజధాని పేరిట నాటకం ఆడుతుండడాన్ని పవన్ తప్పుపట్టారు.
దేనికి గర్జనలు? విశాఖపట్నంలో రుషికొండను అడ్డగోలుగా ధ్వంసం చేసి మీ కోసం భవనం నిర్మించుకొంటున్నందుకా? దసపల్లా భూములను మీ సన్నిహితులకు ధారాదత్తం చేసేలా ఆదేశాలు ఇచ్చినందుకా?అంటూ మూడో ట్విట్ చేశారు. విశాఖకు రుషికొండ ల్యాండ్ మార్కు. కానీ దానిని నామరూపాలు లేకుండా ధ్వంసం చేశారు. అభివృద్ధి పేరిట పూర్తిగా నిర్వీర్యం చేశారు. పర్యాటక విధ్వంసానికి పాల్పడ్డారు. కోర్టులు ఆక్షేపించినా పెడచెవిన పెట్టారు. ఇక విశాఖలో అడ్డగోలుగా భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. భయపెట్టి, ప్రలోభ పెట్టి మరీ తమ వశం చేసుకుంటున్నారు. ఈ కోవలోకే దసపల్లా భూములను డెవలప్ మెంట్ పేరిట వైసీపీ కీలక నేత కుటుంబసభ్యులు లాక్కున్నారు. వీటన్నింటినీ పవన్ ప్రస్తావిస్తూ అందుకే రాజధాని అంటూ విశాఖ చుట్టూ తిరుగుతున్నారా? అని ఎద్దేవా చేశారు.

లోతైన మనస్సు మూలల నుంచి ఉద్భవించే శక్తివంతమైన ఆలోచనకు …భ్రష్టుపట్టిన వ్యవస్థను కూకటివేళ్లతో సహా పెకిలించే శక్తి కలిగివుంటుంది. అది చిన్న అలజడిలా మొదలై, విప్లవంగా మారుతూ, మొదట సాటివారిని.. తరువాత సమూహాలను… ఆపై సమాజాన్ని ప్రభావితం చేసి బడబాగ్నిలా మారుతుంది. అటువంటి లోతైన ఆలోచన శబ్దబేరీలకు చెదరదు. గందరగోళాలకు బెదరదు.. తర్కానికి అందదు… కంటికి కనిపించదు. అడ్డుగా ఉన్న అడ్డంకులను భళ్ళున పగులగొట్టుకుని రెప్పపాటు కాలంలో కార్చిచ్చులా వ్యాపిస్తుందిఅంటూ నాలుగో ట్విట్ చేశారు. సహనానికి ఒక హద్దు అంటూ ఉంటుందని హెచ్చరిస్తూనే.. వైసీపీ దురాగతాల నుంచి రాష్ట్రాన్ని కాపాడే గురుతర బాధ్యత జనసేన తీసుకుంటుందని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు స్పష్టమైన హెచ్చరికలు పంపారు. “!
Also Read:Bandi Sanjay- KTR: లవంగాలు, లఫంగాలు, లంగలు అంటూ ట్విట్టర్ వేదికగా కేటీఆర్, సంజయ్ మాటల యుద్ధం
[…] […]