Homeఆంధ్రప్రదేశ్‌AP Three Capitals: మూడు రాజధానులే కావాలంటూ ఫ్లెక్సీల కలకలం?

AP Three Capitals: మూడు రాజధానులే కావాలంటూ ఫ్లెక్సీల కలకలం?

AP Three Capitals: అమరావతిని రాజధాని చేయాలని అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతులు చేపడుతున్న పాదయాత్ర నేడు తిరుపతికి చేరనుంది. దీంతో వారు వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. మాకు మూడు రాజధానులే కావాలి అంటూ తిరుపతి ప్రజల పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఎవరు పెట్టారో కూడా తెలియడం లేదు. కానీ కావాలనే ఇలా ఫ్లెక్సీలు పెట్టినట్లు తెలుస్తోంది. కానీ ఎన్ని కుట్రలు చేసినా రైతుల మనసు మారదని తెలుసుకోవాల్సి ఉంటుంది.

AP Three Capitals
AP Three Capitals

మరోవైపు దాదాపు ఐదు వందల మంది రైతులు పాదయాత్రలో పాల్గొంటున్నారు. దీంతో అందరికి దర్శన భాగ్యం దొరుకుందో లేదో అనే అనుమానాలు వస్తున్నాయి దీంతో వారు అలిపిరి వద్ద గల గరుడ విగ్రహం వద్ద కొబ్బరికాయలు కొట్టి యాత్ర ముగించాలని భావిస్తున్నట్లు సమాచారం. కానీ రైతులకు దర్శనం ఒక్కసారి కాకుండా రెండు మూడు విడతలుగా లభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించాలని భావించినా ఇంకా అనుమతి మాత్రం రాకపోవడంతో సభ నిర్వహణపై అనుమానాలున్నాయి. సభకు అనుమతి రాకుండా చేయాలని ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. దీంతో సభ నిర్వహణ ఉన్నా లేకపోయినా రైతుల నిరసన మాత్రం తగ్గదని తెలుస్తోంది.

Also Read: Peddireddy Ramachandra Reddy: తల్లి కోరిక తీర్చిన మంత్రి.. ఎల్లమ్మ ఆలయం రెండు నెలల్లో నిర్మాణం

ఈ నేపథ్యంలో రైతులు చేస్తున్న నిరసనలతోనైనా ప్రభుత్వంలో మార్పు వస్తుందని భావించినా అది కనిపించడం లేదు. పైగా ప్రజల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాలు చేస్తూ వారిని మరింత రెచ్చగొడుతున్నట్లు తెలుస్తోంది. రైతులు మాత్రం అమరావతి రాజధాని అయ్యే వరకు విశ్రమించేది లేదని చెబుతున్నారు.

Also Read: MLA Roja: మంత్రి పదవి కాదు కదా.. వచ్చే ఎన్నికల్లో రోజా ఎమ్మెల్యే కూడా కాదంట..?

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular