Pushpa: ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ కి నేషనల్ రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారని చిత్రబృందం తెగ డప్పులు కొట్టింది. కానీ, అందులో ఎంత వాస్తవం ఉంది అనేది అనుమానమే. అందుకే, పాన్ ఇండియా స్థాయిలో బన్నీ రేంజ్ ను కొలవాలని తెగ ముచ్చట పడుతున్నారు. కానీ, హిందీలో “పుష్ప” ఓపెనింగ్స్ దారుణంగా ఉండేలా ఉంది పరిస్థితి. అసలు పాన్ ఇండియా సినిమా అంటే, ముందు హిందీ మార్కెట్ అత్యంత కీలకం.

హిందీలో బాక్సాఫీస్ వద్ద నెగ్గిన వారే నిజమైన పాన్ ఇండియా స్టార్ గా అవుతాడు. అలాగే ఆ సినిమా కూడా పాన్ ఇండియా సినిమా అవుతుంది. అయితే, హిందీ మార్కెట్ పరంగా “పుష్ప” ఎలాంటి ప్రభావం చూపలేకపోతోందనేది అక్కడి బయ్యర్లు చెబుతున్న మాట. నిజానికి హిందీలో కనీస ఓపెనింగ్స్ కూడా వచ్చేలా లేవు, అందుకే, హిందీలో తన సినిమాను ప్రమోట్ చేయాలనే ఆసక్తి కూడా బన్నీకి లేకుండా పోయింది.
అయినా పాన్ ఇండియా సినిమా అంటే.. ముందు బజ్ హిందీలో రావాలి, రావాలి అంటే.. హిందీ ప్రేక్షకులకు నచ్చేలా ఏమి చేయాలి ? ఏమి చేస్తే తమ సినిమా పాన్ ఇండియా సినిమా అవుతుంది అని పుష్ప మేకర్స్ ఆలోచించులేకపోవడం నిజంగానే విచిత్రమే. ఈ విషయంలో ముందుగా దర్శకుడు సుకుమార్ ని తప్పుబట్టాలి.
అనంతరం ప్రొడ్యూసర్స్ గా మై త్రీ మూవీ మేకర్స్ ను కూడా నిందించాలి. పాన్ ఇండియా సినిమా అని మొదటి నుంచి ఓవర్ గా బిల్డప్ ఇచ్చి.. తీరా సినిమా రిలీజ్ అయ్యే సమయానికి సైలెంట్ గా తప్పుకుంటే ఎలా ? ఇక బన్నీ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. తన సినిమాకు హిందీ ఓపెనింగ్స్ ఎలా వస్తాయో ? అసలు వస్తాయా ? రావా ? అని లెక్కలేసుకొని ప్లాన్ ప్రకారం ముందుకు పోవాలి.
Also Read: Pawan Kalyan: ఫ్యామిలీతో ట్రిప్ కి వెళ్లనున్న పవర్ స్టార్… క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా అక్కడే
మొత్తమ్మీద హిందీలో పుష్పను ఎవరు పట్టించుకోవడం లేదు. అందుకే, హిందీలో పుష్పకు వచ్చే కలెక్షన్స్ పై చులకనగా తెగ కామెంట్స్ వస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ సినీ విశ్లేషకుడు సుమిత్ కడేల్ ‘పుష్ప’ హిందీ ఓపెనింగ్స్ పై ఒక ట్వీట్ చేశాడు. పుష్ప కలెక్షన్స్ హిందీలో 50 లక్షల నుంచి 1.50 కోట్ల వరకు ఉంటాయని అంచనా వేశాడు. మరి నిజంగానే ఇలా కలెక్షన్స్ వస్తే మాత్రం.. డబ్బింగ్ వెర్షన్ కి పెట్టిన డబ్బులు కూడా రానట్టే.
Also Read: అతను హీరో ఏమిట్రా ఛీ అన్నారు.. కానీ అతనే హీరో అయ్యాడు !