
సోషల్ మీడియాలో పులులు.. బయట మాత్రం పిల్లులు అన్న ముద్రను పవన్ ఫ్యాన్స్ తెచ్చుకున్నారు. ట్విట్టర్ తోపాటు సోషల్ మీడియాలో పవన్ పై ఈగ వాలనీయని పవన్ ఫ్యాన్స్.. ఎన్నికల్లో మాత్రం ఆయనను గెలిపించుకోలేకపోయారు. పవన్ దారుణ ఓటమిని ఎన్నికల్లో చవిచూశారు. అయితే సామాజిక మాధ్యమాల్లో మాత్రం పవన్ ఫ్యాన్స్ ను కొట్టే మొగాడు ఇంకా పుట్టలేదు. లక్షల ట్వీట్లతో ట్రెండింగ్ చేయడంలో పవన్ ఫ్యాన్స్ తర్వాతే ఎవరైనా.. అంతటి భీకర ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ సొంతం.
తాజాగా జనసేన పార్టీ తరుఫున ఒక ప్రకటన విడుదలైంది. టీవీ9 కథనాల వల్ల జనసేన కార్యకర్తలు బాధపడుతున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వారందరూ సంయమనం పాటించాలని కోరారు. ఇక ఎప్పుడైతే ఆ లేఖ విడుదల అయ్యిందో ఇక పవన్ ఫ్యాన్స్ ఆ చానెల్ మీద ట్విట్టర్ వేదికగా విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు #Shamelesstv9ను జనసేన ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.
అసలు విషయానికి వస్తే.. హీరోయిన్ మాధవీలత ఇటీవల పవన్ కళ్యాణ్ కు రాసిన ఒక బహిరంగ లేఖ సంచలనం సృష్టించింది. పవన్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో తనను విష్ చేసిన అందరినీ పేరుపేరునా థ్యాంక్స్ చెబుతున్నారు. అయితే అలా చెప్పడం తనకు నచ్చలేదని చెబుతూ హీరోయిన్ మాధవీలత తన సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ పెట్టింది.
అయితే ఈ చిన్న విషయాన్ని వదిలేయకుండా షరామామూలుగానే టీవీ9 రచ్చ రంభోలా చేసింది. ఈ విషయాన్ని అందరూ లైట్ తీసుకున్నా ప్రముఖ చానల్ టీవీ9 సీరియస్ గా తీసుకొని వరుస కథనాలు ప్రసారం చేసింది. ఈ విషయం మీద పవన్ ఏమీ స్పందించ లేదు. తెలుగులోనే టాప్ న్యూస్ చానెల్ టీవీ9 ఇలా చేయడంపై జనసేన నేతలు, ఫ్యాన్స్ మాత్రం భగ్గుమన్నారు.. టీవీ9ను టార్గెట్ చేశారు.. ట్విట్టర్ లో ఇప్పుడు #Shamelesstv9ను జనసేన ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. స్వయంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శివశంకర్ సైతం ఈ ట్రెండింగ్ ను మొదలుపెట్టడం చర్చనీయాంశమైంది. ఇంతకీ టీవీ9పై జనసేన ఫ్యాన్స్ కు ఎందుకు కోపం వచ్చిందనేది ఆసక్తిగా మారింది.
