https://oktelugu.com/

ఫేం లేని వారు బిగ్ బాస్ లోకి.. కళతప్పిందా?

బిగ్‌బాస్‌ ఇప్పటివరకు మూడు సీజన్లు పూర్తి‌ చేసుకుంది. ఇప్పుడు నాలుగో సీజన్‌ ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు షో మొదలైంది. నాగార్జున ఎప్పటిలానే అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. ఆయన సినిమాల్లోని పాటలకు స్టెప్పులేశారు. అయితే, ఈ షోలో హోస్ట్ నాగార్జున డ్యుయల్ రోల్‌తో దర్శనమివ్వడం విశేషం. ముందు హోస్ట్ నాగార్జున అడుగుపెట్టగా.. ఆయన తండ్రి పాత్రలో అతిథిగా ముసలి నాగార్జున వచ్చారు. ఆయన బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లి కలియతిరిగారు. తన స్టైల్లోనే పంచ్‌లు, చమత్కారాలతో […]

Written By:
  • NARESH
  • , Updated On : September 7, 2020 1:19 pm
    bigboss 4 participants

    bigboss 4 participants

    Follow us on

    bigboss 4 participants
    బిగ్‌బాస్‌ ఇప్పటివరకు మూడు సీజన్లు పూర్తి‌ చేసుకుంది. ఇప్పుడు నాలుగో సీజన్‌ ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు షో మొదలైంది. నాగార్జున ఎప్పటిలానే అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. ఆయన సినిమాల్లోని పాటలకు స్టెప్పులేశారు. అయితే, ఈ షోలో హోస్ట్ నాగార్జున డ్యుయల్ రోల్‌తో దర్శనమివ్వడం విశేషం. ముందు హోస్ట్ నాగార్జున అడుగుపెట్టగా.. ఆయన తండ్రి పాత్రలో అతిథిగా ముసలి నాగార్జున వచ్చారు. ఆయన బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లి కలియతిరిగారు. తన స్టైల్లోనే పంచ్‌లు, చమత్కారాలతో అలరించారు.ఈ సీజన్‌లో 16 మంది కంటెస్టెంట్స్‌ ఎంటర్‌‌ అయ్యారు. ముందుగా వీరందరినీ క్వారంటైన్‌లో ఉంచి ఆ తరువాత కొవిడ్ టెస్టులు చేసి హౌజ్‌లోకి పంపినట్టు నాగార్జున చెప్పారు. తాను కూడా కరోనా వైరస్ పరీక్ష చేయించుకున్నానని, నెగిటివ్ అని తేలిన తరవాతే బిగ్ బాస్ వేదికపైకి వచ్చానని నాగార్జున స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, యూట్యూబ్ ద్వారా పాపులర్ అయిన గంగవ్వ ఈ షోలో 16వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. ఆమె చాలా ప్రత్యేకమని, ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని, అలా చేయకపోతే పనిష్‌మెంట్లు ఉంటాయని మిగిలిన కంటెస్టెంట్లకు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ఫస్ట్‌ మూడు సీజన్లపై కొంత ఉత్సాహంగానే కనిపించిన నెటిజన్లు ఈ సీజన్‌పై కొంత పెదవి విరుస్తున్నారు. పెద్దగా ఫేం ఉన్న కంటెస్టెంట్స్‌ ఎవరూ లేకపోవడంతో నిరుత్సాహంగా ఉన్నారు. గత మూడు సీజన్లలో.. ఈ సీజన్లలో ఒకసారి కంటెస్టెంట్లను పరిశీలిస్తే..

    ఫస్ట్‌ సీజన్‌: కంటెస్టెంట్లుగా సినీ నటులు అర్చన, సమీర్‌‌ హసన్‌, ముమైత్‌ ఖాన్‌, ప్రిన్స్‌, జ్యోతి, శివబాలాజీ, సంపూర్ణేశ్‌ బాబు, ఆదర్శ్‌, హరి తేజతో పాటు హాస్యనటుడు ధన్‌రాజ్‌, గాయకులు మధు ప్రియ, కల్పన, టీవీ యాంకర్‌‌ కత్తి కార్తీక, సినీ విమర్శకుడు మహేశ్ కత్తి వచ్చారు.  దీక్ష పంత్‌, మరో నటుడు నవదీప్‌ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్‌ సీజన్‌కు హోస్ట్‌గా యంగ్‌ టైగర్‌‌ జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌ వచ్చారు.

    సెకండ్‌ సీజన్‌: సింగర్‌‌ గీతా మాధురి, నటులు అమిత్‌ తివారి, తనీష్‌ అల్లాడి, భను శ్రీ, కిరీటి దామరాజు, కౌషల్‌, తేజస్వి మాడివాడ, సామ్రాట్‌, టీవీ9 యాంకర్‌‌ దీప్తి నల్లమోతు, హ్యూమన్‌ రైట్స్‌ యాక్టివిస్ట్‌ బాబు గోగినేని, ర్యాపర్‌‌ రోల్‌ రైడా, యాంకర్‌‌ శ్యామల, సోషల్‌ మీడియా స్టార్‌‌ దీప్తి సునైనా, రేడియో జాకీ గణేశ్‌, మోడల్‌ సంజనా అన్నె, సోషల్‌ యాక్టివిస్ట్‌ నూతన్‌ నాయుడు కంటెస్టులుగా వచ్చారు. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా మోడల్‌ నందిని రాయ్‌, మోడల్‌ పూజా రామచంద్రన్‌ ఎంటర్‌‌ అయ్యారు. ఈ సెకండ్‌ సీజన్‌కు హోస్ట్‌గా నటుడు నాని వ్యవహరించారు.

    సీజన్‌ త్రీ: గాయకుడు రాహుల్‌ సింప్లిగంజ్‌, నటి/యాంకర్‌‌ శ్రీముఖి, కొరియోగ్రాఫర్‌‌ బాబా భాస్కర్‌‌, సినీ నటులు వరుణ్‌ సందేశ్‌, మహేశ్‌ విట్టా, పునర్నవి భూపాలం, వితికా షేరు, హిమజ, హేమ, అలీరెజా, అషు రెడ్డి, సీరియల్స్‌ నటులు రవికృష్ణ, రోహిణి, యాంకర్స్‌ శివజ్యోతి, శిల్పా చక్రవర్తి, టీవీ9 జర్నలిస్ట్‌ జాఫర్‌‌ బాబు, మోడల్‌ తమన్నా సింహాద్రి కంటెస్టెంట్స్‌. ఈ సీజన్‌కు ప్రముఖ సినీ నటుడు, నవ మన్మథుడు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు.

    ఎట్‌ నౌ ప్రెజెంట్‌ ఫోర్త్‌ సీజన్‌ : నటులు మోనాల్‌ గజ్జర్‌‌, కరాటే కల్యాణి, నోయల్‌, అభిజిత్‌, అఖిల్‌ సార్థక్‌, దర్శకుడు సూర్య కిరణ్‌, యాంకర్స్‌‌ లాస్య, జోర్దార్‌‌ సుజాత, అరియానా గ్లోరీ, సోషల్‌ మీడియా సెన్సేషన్‌ మెహబూబ్‌ దిల్‌సే, న్యూస్‌ ప్రెజెంటర్‌‌ దేవి నాగవల్లి, యూట్యూబ్‌ స్టార్స్‌ దేత్తడి హారిక, గంగవ్వ, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌‌ సయ్యద్ సోహైల్‌, కొరియోగ్రాఫర్‌‌ అమ్మ రాజశేఖర్‌‌, వెబ్‌ సిరీస్‌ నటి దివి కంటెస్టెంట్లుగా ఉన్నారు. ఈ సీజన్‌కు హోస్ట్‌గా మన్మథుడు నాగర్జుననే వ్యవహరిస్తున్నారు.

    ఫస్ట్‌ మూడు సీజన్లలోనూ ఇంతోఅంతో చెప్పుకోదగ్గ కంటెస్టెంట్లు ఉన్నారు. ఈ సీజన్‌ వరకు వచ్చేసరికి.. యూట్యూబ్‌ స్టార్స్‌ గంగవ్వ, దేత్తడి హారిక తెలుసు. వీరితోపాటు కరాటే కల్యాణి, అమ్మరాజశేఖర్‌‌, సూర్య కిరణ్‌ నాటి తరం వాళ్లే. వీళ్లు ఔట్‌ డేటెడ్‌ అనే చెప్పాలి. ఈ తరం వారికి పెద్దగా తెలియదు. యాంకర్స్‌ లాస్య, నటుడు నోయల్‌ కొద్దోగొప్పో తెలుసు. ఇంతకుమించి పెద్దగా తెలిసిన ఫేం అయిన వారు ఎవరూ లేరు.