Pawan Kalyan Politics : 2023 : పవన్ కు కీలకం.. పాదయాత్రతో ఏపీ రాజకీయాలను మార్చేయనున్న జనసేనాని

Pawan Kalyan Politics : ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సెంటరాఫ్ అట్రాక్షన్. ఇప్పుడు ఆయన చుట్టూ తెలుగు రాజకీయాలు తిరుగుతున్నాయి. మొన్నటివరకూ ఆయనకు మూడోస్థానం కట్టబెట్టిన ప్రజలు..ఇప్పుడు 40 ఈయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు, ఏపీ సీఎం జగన్ కు తోసిరాజని తొలిస్థానం కట్టబెట్టేందుకు రెడీ అవుతున్నారు. పవన్ కు మాత్రం 2022 కలిసి వచ్చిందనే చెప్పొచ్చు. ఏపీలో జనసేన ఆవిర్భావం తరువాత ఆ పార్టీ అవసరం తేల్చిచెప్పిన ఏడాది ఇది. ప్రజల తన అవసరాన్ని […]

Written By: Dharma, Updated On : January 1, 2023 7:19 pm
Follow us on

Pawan Kalyan Politics : ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సెంటరాఫ్ అట్రాక్షన్. ఇప్పుడు ఆయన చుట్టూ తెలుగు రాజకీయాలు తిరుగుతున్నాయి. మొన్నటివరకూ ఆయనకు మూడోస్థానం కట్టబెట్టిన ప్రజలు..ఇప్పుడు 40 ఈయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు, ఏపీ సీఎం జగన్ కు తోసిరాజని తొలిస్థానం కట్టబెట్టేందుకు రెడీ అవుతున్నారు. పవన్ కు మాత్రం 2022 కలిసి వచ్చిందనే చెప్పొచ్చు. ఏపీలో జనసేన ఆవిర్భావం తరువాత ఆ పార్టీ అవసరం తేల్చిచెప్పిన ఏడాది ఇది. ప్రజల తన అవసరాన్ని గుర్తించిన పవన్ కూడా అందుకు తగ్గట్టు వ్యూహాత్మకంగా ముందుకు కదిలారు. ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నించారు. కౌలురైతుభరోసా యాత్ర, జనవాణి వంటి వినూత్న కార్యక్రమాలతో ప్రజాభిమానాన్ని రెట్టింపు చేసుకున్నారు. అప్పటివరకూ ప్రధాన రాజకీయ పక్షాలుగా ఉన్న వైసీపీ, టీడీపీ సరసన జనసేనను నిలబెట్టగలిగారు.

ఇప్పుడు జనసేన లేనిదే ఏపీ రాజకీయం లేదు… రాజకీయ చర్చలు లేవు. రచ్చబండ నుంచి టీవీ డిబేట్ల వరకూ జనసేన టాపిక్ లేనిదే చర్చ ముందుకు కదలదు. ఈ ఏడాది పవన్ కీలకంగా మారనున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో ఆయన తీసుకోబోయే నిర్ణయాలు, చేపట్టే పనులు ఏపీ రాజకీయాలను విపరీతంగా ప్రభావం చూపనున్నాయి. ఇప్పటికే జనసేన బీజేపీ మిత్రపక్షంగా ఉంది. కేంద్ర పెద్దలతో పవన్ కు సఖ్యత ఉంది. అటు చంద్రబాబు సైతం పవన్ తో పొత్తుకు ప్రయత్నిస్తున్నారు. కానీ పవన్ అంతరంగం మాత్రం అంతుచిక్కడం లేదు. కానీ వైసీపీ విముక్త ఏపీకి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం పొత్తుల గురించి ఆలోచించకుండా తాను సొంతంగా బలం పెంచుకోవాలని భావిస్తున్నారు. అయితే అది ముమ్మాటికీ జగన్,  చంద్రబాబు అవకాశాల్ని ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అన్నింటికీ మించి ఈ ఏడాది పవన్ బస్సు యాత్ర, యువభేరీ వంటి వినూత్న కార్యక్రమాలు ఏపీ రాజకీయాలను ప్రభావితం చేయనున్నాయి. ఇప్పటికే పవన్ ప్రచార రథం వారాహి సిద్ధమైంది. సోమవారం కొండగట్టు ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో వాహన పూజ చేయనున్నారు. పండుగ అనంతరం ఏ క్షణమైనా పవన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. సంప్రదాయ పార్టీల మాదిరిగా జనసమీకరణ చేయాల్సిన అవసరం జనసేనకు లేదు. అందుకే హైకమాండ్ పవన్ యాత్ర షెడ్యూల్ ను సాదాసీదాగానే రూపొందిస్తోంది. దానికి ఎటువంటి హడావుడి చేయడం లేదు. జనవరి 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన యువభేరీ నిర్వహించనుంది. యువత, విద్యార్థులను టార్గెట్ చేసుకొని పవన్ కీలక ప్రసంగం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో యువభేరీలు నిర్వహించనున్నారు. ఒక్క యువతే కాకుండా గిరిజనులు, మత్స్యకారులు, ఇతర వెనుకబడిన వర్గాల వారికి సంబంధించి భేరీలు నిర్వహించేందుకు నిర్ణయించారు.

పవన్ కళ్యాణ్ ఏపీ పాలిటిక్స్ ను  హీటెక్కించడం ఖాయమని తెలియడంతో అటు అధికార పక్షం, ఇటు ప్రధాన విపక్షం జాగ్రత్తపడుతున్నాయి. పవన్ ను టచ్ చేసే విషయంలో ఇప్పటికే పలుమార్లు వైసీపీ నేతలు దెబ్బతిన్నారు. ఇప్పుడు పవనే నేరుగా రంగంలోకి దిగుతుండడంతో వైసీపీ నేతల్లో నిద్రపట్టడం లేదు. పవన్ పై విమర్శలకే అన్నట్టు ఉన్న నేతలు వైసీపీలో అధికం. వారంతా ఇప్పుడు తెగ భయపడుతున్నారు. పవన్ బస్సు యాత్ర తమ నియోజకవర్గాలకు వస్తే మాటల తూటలు పేలడం ఖాయమని కంగారుపడుతున్నారు. తమ వైఫల్యాలను పవన్ ప్రస్తావిస్తారని.. తమకు రాజకీయంగా దెబ్బ తగలడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చారు. అటు ప్రధాన విపక్షం టీడీపీ కూడా కలవరపడుతోంది. పొత్తుపై పవన్ స్పష్టత ఇవ్వకపోవడం ఒక ఎత్తు అయితే.. పవన్ పర్యటనతో ప్రజలు జనసేన వైపు యూటర్న్ తీసుకుంటే.. అది తమ విజయంపై ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు.  మొత్తానికి 2023 సంవత్సరంలో పవన్ కీలకం కాబోతున్నారున్న మాట. ఇన్నాళ్లు తాము వేచిచూసినది ఇదేనంటూ జన సైనికులు సంబరపడుతున్నారు.