JanaSena: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో క్లియర్ కట్ గా తన వ్యూహాలు, పోటీ చేసే స్థానాలపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక అంచనాకు వచ్చినట్టు తెలిసింది. పొత్తు ఉన్నా.. లేకున్నా.. జనసేనకు బలమున్న ఆ 85 స్థానాల్లో పోటీకి పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నాడట.. ఈ మేరకు జనసైనికులకు సంకేతాలు పంపాడని.. ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే నియోజకవర్గ అభ్యర్థులు రంగంలోకి దిగారని సమాచారం.

ఇటీవల మారిన ఏపీ రాజకీయ పరిణామాల్లో జనసేనాని పవన్ ను టీడీపీ అధినేత చంద్రబాబు కలిసి రాజకీయం చేశారు. విశాఖలో పవన్ ను వేధించిన వైసీపీ సర్కార్ కు వ్యతిరేకంగా చంద్రబాబు చేతులు కలిపారు. ఆ సమయంలో పొత్తుల ప్రస్తావన వచ్చినట్టు ప్రచారం సాగింది.
ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 100 స్థానాల్లో పోటీచేయాలని టీడీపీ భావిస్తోంది. ఓ 65 స్థానాలు జనసేనకు, బీజేపీకి ఓ 10 స్థానాలు ఇవ్వాలని యోచిస్తోందట.. కానీ బీజేపీ కలిసి వచ్చే అవకాశాలు లేకుండా జనసేనకు 75 ఇవ్వాలని ప్లాన్ చేస్తోందట..

కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తమకు బలమున్న 85 స్థానాలను ఇప్పటికే ఖరారు చేశారని.. ఆ సీట్లను బల్లగుద్దీ మరీ చంద్రబాబును అడిగేందుకు డిసైడ్ అయ్యాడట.. ఒకవేళ పొత్తు లేకుంటే ఆ మొత్తం 85 స్థానాల్లో జనసేన బలమైన అభ్యర్థులు బరిలోకి దిగడం గ్యారెంటీ.. మొత్తం 175 సీట్లకు పోటీచేసే అవకాశం ఉంటుంది. ఇందులో బీజేపీకి కొన్ని సీట్లు కేటాయించవచ్చు.
పొత్తు ఉన్నా లేకున్నా జనసేన పోటీ చేసే స్థానాల సంఖ్య మాత్రం లెక్క తేలిందట.. చంద్రబాబు కలిసి వచ్చినా రాకున్నా ఆ సీట్లలో గెలుపుకోసం జనసేన పక్కా లెక్కలు సిద్ధం చేసినట్టు సమాచారం.