Jairam Ramesh On Modi: కేంద్రంలోని బీజేపీ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలుస్తోందని, గడిచిన 9 ఏళ్లలో అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చి అధికారంలోకి వచ్చిందని విపక్షాలు పదే పదే ఆరోపిస్తున్నాయి. తాము అధికారంలో లేని రాష్ట్రల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుంది.. అలా వినకుంటే ఐటీ, ఈడీ దాడులు చేయించి పార్టీ మారేలా ప్రోత్సహిస్తోందని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలో ఇదే తరహా ప్రయోగం చేసింని ఉదహరిస్తున్నాయి.
అవినీతిపరులంతా నీతిపరులైపోతారు..
ఇక అవినీతి ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరితే.. నీతిపరులైపోతారని కాంగ్రెస్‌తోపాటు పలు ప్రాంతీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వాలను కూల్చేందుకు, తమ ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు ఐటీ, ఈడీ దాడులు చేయించి అనినీతి ముద్ర వేస్తుందని, పార్టీలో చేరగానే ఆ మరక పోతుందని విమర్శిస్తున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ అయితే.. ఇటీవల హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించిది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా, ప్రధాన మంత్రి మోదీ, హో మంత్రి అమిత్‌షా పర్యటన వేళ ఇలాంటి ఫ్లెక్సీలు హైదరాబాద్‌లో వెలిశాయి.
తాజాగా జైరామ్ రమేశ్..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ మరోసారి విరుచుకుపడ్డారు. మహారాష్ట్రలో ఎన్సీపీ నాయకులు అవినీతిపరులంటూ ఆరోపించిన మోదీ ఇప్పుడు ఆదే నాయకులను ప్రభుత్వంలో ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు. ‘బీజేపీ వాషింగ్ మెషీన్ మళ్లీ పని చేస్తోందని, ఇన్‌కంట్యాక్స్, సీబీఐ, ఈడీ(ఐసీఈ) అనే సబ్బుతో అవినీతిపరులను పరిశుద్ధులను చేస్తోంది’ అని ట్విట్టర్‌లో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అన్ని మరకలను చిటికెలో తొలగిస్తుంది అనే ట్యాగ్‌లైన్‌తో ‘మోదీ వాషింగ్ పౌడర్’ చిత్రాన్ని చేశారు. విపక్షాల కూటమి ఏర్పాటు కాకూడదని కోరుకుంటున్న బీజేపీకి భంగపాటు తప్పదని స్పష్టం చేశారు.
మౌనమే బీజేపీ సమాధానం..
ప్రభుత్వాలు కూల్చడం.. విపక్ష ఎమ్మెల్యేలపై ఐటీ, సీబీఐ, ఈడీ దాడులు చేయడం, విపక్ష ఎమ్మెల్యేలు బీజేపీలో చేరగానే వారిపై ఉన్న అవినీతి ఆరోపణలు, కేసులు మాయమవడం, దాడులు ఆగిపోవడంపై బీజేపీ వ్యతిరేక పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా బీజేపీ నేతలు స్పందించరు. అసలు ఆ విమర్శలను పట్టించుకోరు. కనీసం ఖడించడం కూడా చేయరు. మౌనమే అన్నిటికీ సమాధానం అన్నట్లు వ్యవహిస్తారు. దీంతో మొత్తుకుని మొత్తుకుని విపక్షాల నోళ్లు నొప్పి పెట్టడం మినహా బీజేపీకి రవ్వంత నష్టం కలుగడం లేదు.