గాంధీ ఆస్పత్రిపై అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన ఆరోపణలు

తెలంగాణలోని కోవిడ్-19 ఆసుప్రతిగా వినియోగిస్తున్న గాంధీ ఆస్పత్రి కన్నా జైలే బెటరని ఎంఐఎం నేత, అక్బరుద్దీన్ ఓవైసీ విమర్శించారు. టీఆర్ఎస్ మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ కరోనాకు సేవలందిస్తున్న గాంధీ ఆస్పత్రిపై విమర్శలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నరోగులు తనకు అక్కడ వాళ్లు పడిన ఇబ్బందులు తెలియజేశారని చెప్పారు. ఆస్పత్రిలో పారిశుధ్యలోపం ఉందని, రోగులకు మందుల పంపిణీ సరిగా ఉందని, పేషంట్లకు ఇచ్చే ఆహారం అధ్వానంగా ఉంటుందని వారు ఆవేదన […]

Written By: Neelambaram, Updated On : April 24, 2020 2:20 pm
Follow us on


తెలంగాణలోని కోవిడ్-19 ఆసుప్రతిగా వినియోగిస్తున్న గాంధీ ఆస్పత్రి కన్నా జైలే బెటరని ఎంఐఎం నేత, అక్బరుద్దీన్ ఓవైసీ విమర్శించారు. టీఆర్ఎస్ మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ కరోనాకు సేవలందిస్తున్న గాంధీ ఆస్పత్రిపై విమర్శలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నరోగులు తనకు అక్కడ వాళ్లు పడిన ఇబ్బందులు తెలియజేశారని చెప్పారు. ఆస్పత్రిలో పారిశుధ్యలోపం ఉందని, రోగులకు మందుల పంపిణీ సరిగా ఉందని, పేషంట్లకు ఇచ్చే ఆహారం అధ్వానంగా ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు అక్బరుద్దీన్ తెలిపారు.

కరోనా కట్టడికి ప్రభుత్వం ప్రజలకే కేవలం అవగాహన కల్పిస్తేనే సరిపోదని విమర్శించారు. వైద్యసేవలందించే ఆస్పతుల్లో సరైన సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రజలు సోషల్ డిస్టెన్స్, వ్యక్తిగత శుభ్రత పాటిస్తున్నారని కానీ ప్రభుత్వం మాత్రం ఆస్పత్రుల్లో పారిశుధ్య చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. సెక్రటేరియట్‌లోని కరోనా అనుమానితుల కోసం క్వారంటైన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. టెస్టులు సంఖ్య కూడా పెంచాలని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియాన్ని కోవిడ్-19 ఆసుపత్రిగా మార్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

అదేవిధంగా స్థానిక ఆస్పత్రుల్లో ఓపి సేవలను పునరుద్ధరించాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. పెండింగ్‌లోని ఆరోగ్యశ్రీ బిల్లులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగి.. పరిస్థితులు దిగజారితే ఓవైసీ గ్రూప్స్ ఆస్పత్రులు, వైద్య సిబ్బంది సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. టీఆర్ఎస్ మిత్రపక్షమైన ఎంఐఎం నేత అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే..!