
Eenadu Vs Sakshi: “ది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ ఇన్ తెలుగు”.. ఉదయాన్నే మన గుమ్మాల ఎదుట ఉండే ఈనాడు మాస్టర్ హెడ్ మీద ఉండే ట్యాగ్ లైన్ ఇది.. ఇక ముందు నుంచి అది ఉండకపోవచ్చు. ఎందుకంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రామోజీరావును అంతలా దెబ్బకొట్టాడు మరీ. మొన్నామధ్య జీవో 12 పేరుతో ఏపీ ప్రభుత్వం మీకు ఇష్టమైన పేపర్లు కొనుక్కోండి అని వాలంటీర్లకు నెలకు 300 చొప్పున ఇచ్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. ఇది సాక్షి పేపర్ కు మేలు చేయడమేనని ఈనాడు ప్రధానారోపణ.. దీనివల్ల సాక్షి సర్కులేషన్ పెరిగి తన నెంబర్ వన్ స్థానానికి ఉపద్రవం వస్తుందని ఈనాడు భయం కూడా.. అందుకే హైకోర్టు మెట్లు ఎక్కింది. ఏబిసి సర్కులేషన్ ఆధారంగా వాలంటీర్లకు పేపర్లు కొనుక్కునే అవకాశం ఇవ్వాలని పిటీషన్ లో పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ఇరుపక్షాల వాదనలు విన్న హై కోర్టు పిటీషన్ కొట్టేసింది.
ముందుగానే చెప్పినట్టు ఈనాడు అసలు భయం తన నెంబర్ వన్ స్థానం పోతుందని.. సర్కులేషన్ పడిపోతుందని.. అన్నిటికంటే నంబర్ వన్ పేరుతో తాను ఇన్నాళ్లు సాగిస్తున్న యాడ్స్ దందా ఆగిపోతుందని.. అందుకే కోర్టు మెట్లు ఎక్కింది. ఫర్ డిబేట్ సేక్ ఇదే బాబు హయాంలో రాష్ట్రంలో ఏ గ్రంథాలయం చూసినా, ప్రభుత్వ కార్యాలయం చూసినా ఈనాడు, ఆంధ్రజ్యోతి మాత్రమే కనిపించేవి. ఎందుకలా అంటే అవి పచ్చ మీడియా కాబట్టి. బాబును జాకీలు పెట్టి లేపేవి కాబట్టి.. అప్పుడు అధికారులు అలాగే నడుచుకునే వారు. అప్పుడు సాక్షిని అధికారులు పరిగణన లోకి తీసుకునే వారు కాదు. అదే సమయం సాక్షి ఏ కోర్టు మెట్లు ఎక్కలేదు.

జగన్ ప్రభుత్వం వచ్చాక వాలంటరీ వ్యవస్థను ప్రవేశ పెట్టాడు. అంతే కాదు ప్రభుత్వ పథకాలను వారితోనే ప్రచారం చేయిస్తున్నాడు. ఇది పచ్చ క్యాంప్ కు అబ్సర్డ్ లాగా అనిపిస్తోంది కానీ అప్పట్లో జన్మ భూమి కమిటీలు చేసింది ఇదే కదా! ఇప్పుడు ఇదే వలంటీర్లు కు పేపర్లు కొనే అవకాశం ఇవ్వడంతో అందరూ సాక్షినే కొంటారు అనేది రామోజీరావు ఆరోపణ. దీనివల్ల సర్క్యులేషన్ పడిపోతుంది అనేది అతగాడి బాధ. అటు జగన్ ప్రభుత్వవేమో పేపర్ కొనే భత్యం ₹300 కి మించి పెంచే అవకాశం లేదు. ఇవ్వదు కూడా. సో ఇది ఏతా వాతా సాక్షికే లాభం చేకూరుస్తుంది అనేది ఈనాడు వాదన. మరో వైపేమో ప్రభుత్వం తాము వలంటీర్లకు పేపర్ కొనండి అని చెప్పాం కానీ, పర్టికులర్ గా సాక్షినే కొనాలని అదేశించలేదని అంటోంది. మొత్తానికి రామోజీరావు కుంభస్థలం మీద కొట్టే ప్రయత్నాన్ని జగన్ మొదలు పెట్టాడు. అది కూడా హై కోర్టు రూపంలో..
Also Read: Chiranjeevi Bhola Shankar: భోళా శంకర్ తర్వాత చిరంజీవి సినిమాలు చెయ్యడం లేదా..? అయ్యోమయంలో ఫ్యాన్స్