CM Jagan: జగన్ నిశ్శబ్దం.. తనకే ప్రమాదం

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు జగన్ చెప్పుకొచ్చారు.

Written By: Dharma, Updated On : December 6, 2023 11:15 am

CM Jagan

Follow us on

CM Jagan: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. పట్టుమని ఆరు నెలల వ్యవధి కూడా లేదు. పండుగ అనంతరం ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ తరుణంలో జగన్ తీవ్ర ఆందోళనతో ఉన్నారు. తన రాజకీయ మిత్రుడు కేసీఆర్ ఓటమితో ఓ రకమైన అభద్రతా భావాన్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కొన్ని నిర్ణయాల విషయంలో భయపడుతున్నట్లు కనిపిస్తున్నారు. కనీసం తానేం చేస్తానో? ఎందుకు చేస్తున్నానో? చెప్పేందుకు సైతం భయపడుతున్నారు. విశాఖ నుంచి పాలన విషయంలో సీఎంగా ఆయన చేసిన ప్రకటనలు బుట్ట దాఖలవుతున్నాయి. అంతిమంగా అవి ఆయనకే నష్టం చేకూరుస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు జగన్ చెప్పుకొచ్చారు. కర్నూలులో న్యాయ రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, విశాఖలో పాలన రాజధాని ఏర్పాటు చేస్తామని జగన్ ప్రకటించారు. కానీ తర్వాత విశాఖ రాజధాని అంటూ వైసీపీ నేతలు బ్లాస్ట్ అయ్యారు. సహజంగానే ఇది రెండు ప్రాంతాల్లో ప్రజలనుఇబ్బంది పెట్టించింది. అలాగని విశాఖలో రాజధాని పెట్టడాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు స్వాగతించలేదు.అలాగని రాజధాని లో విషయంలో ముందడుగు వేయలేకపోయారు. అమరావతిని పూర్తిగా చంపేశారని అపవాదుని ఎదుర్కొన్నారు. దాదాపు కోస్తా లోని మూడు నాలుగు జిల్లాల్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

అదిగో విశాఖ నుంచి పాలన పలానా రోజు నుంచి ప్రారంభిస్తామని జగన్ స్వయంగా ప్రకటన చేసిన సందర్భాలు ఉన్నాయి.కానీ తేదీలు మారుతున్నాయి. రోజులు నెలలు గడుస్తున్నాయి. కానీ సీఎం జగన్ హామీ మాత్రం నెరవేరడం లేదు. కార్యరూపం దాల్చడం లేదు. సహజంగానే ప్రజల్లో ఇ దో వైఫల్య మాటగా మిగిలిపోనుంది. కనీసం విశాఖ వెళ్దామా? లేదా? అని అధికార పార్టీ శ్రేణులకు తెలియడం లేదు. వారంతా ఒక కన్ఫ్యూజ్ లో ఉన్నారు. ఇప్పుడు విశాఖ వెళ్ళినా.. పంతం నెగ్గించుకునేందుకు మాత్రమేనని… అక్కడి ప్రజలు సైతం ఆహ్వానించారని అధికార పార్టీలో ఒక రకమైన చర్చ నడుస్తోంది. ఉన్నది రెండు నెలల వ్యవధి. ఇప్పుడు వెళ్లిన వర్క్ అవుట్ కాదని ఎక్కువ మంది భావిస్తున్నారు. విశాఖపట్నం విషయంలో సీఎం జగన్ స్వయంకృతాపమని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. విశాఖ పేరు చెప్పి అమరావతి నిర్వీర్యం చేశారు. కనీసం విశాఖ వస్తాం అన్న హామీని కూడా అమలు చేయలేకపోయారు. అటువంటప్పుడు ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చిందని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఈ విషయంలో సీఎం జగన్ వ్యూహాత్మక తప్పిదమని తేల్చి చెబుతున్నాయి. దీనికి మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నాయి.