https://oktelugu.com/

Chandrababu: బాబు ఢిల్లీ వ్యూహం అదే

తెలంగాణ ఎన్నికల తో పాటు ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు అనుకూల ఫలితాలు వచ్చి ఉంటే చంద్రబాబు వ్యూహం మరోలా ఉండేది. ఇండియా కూటమి వైపు స్వేచ్ఛగా అడుగులు వేసేవారు.

Written By: , Updated On : December 6, 2023 / 11:18 AM IST
Chandrababu

Chandrababu

Follow us on

Chandrababu: జాతీయస్థాయిలో చంద్రబాబు పాత్ర ఏమిటి? ఎన్డీఏలో చేరతారా? ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తారా? దేశవ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తోంది. చంద్రబాబు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అని వార్య పరిస్థితి ఎదురయింది. ఏదైనా జాతీయ పార్టీ అండలేనిది రాష్ట్రాల్లో రాజకీయాలు సాగించడం అసాధ్యమని ఆయనకు తెలుసు. అందుకే ఇప్పుడు బిజెపితో సఖ్యత కుదుర్చుకునేందుకే ఆయన ఢిల్లీ వెళుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

తెలంగాణ ఎన్నికల తో పాటు ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు అనుకూల ఫలితాలు వచ్చి ఉంటే చంద్రబాబు వ్యూహం మరోలా ఉండేది. ఇండియా కూటమి వైపు స్వేచ్ఛగా అడుగులు వేసేవారు. అటు తెలంగాణలో సైతం తన వల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్న కారణాలు చూపలేకపోతున్నారు. టిడిపి అభిమానులు ఎక్కువగా ఉండే గ్రేటర్లో బీ ఆర్ఎస్ కు సానుకూల ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో అక్కడ ఫలితాలు రాలేదు. దీంతో టీడీపీ వల్లే కాంగ్రెస్ గెలిచింది అన్న వాదనను హస్తం పెద్దలు పెద్దగా విశ్వసించలేదు. పైగా ఐదు రాష్ట్రాల్లో బిజెపికి సానుకూల ఫలితాలు వచ్చాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి హ్యాట్రిక్ కొడుతుందని తేలింది. దీంతో బీజేపీకి చంద్రబాబు తప్పకుండా సరెండర్ కావాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది.

ఈనెల 7న ఢిల్లీకి చంద్రబాబు వెళ్ళనున్నారు.ఎలక్షన్ కమిషనర్ కు కలవనున్నారు. ఈనెల 10న ఎలక్షన్ కమిషన్ బృందం ఏపీకి రానుంది. అయితే చంద్రబాబు నిజంగా ఈసీకి కలిసేందుకే ఢిల్లీ వెళ్తున్నారా? మరి ఏమైనా కారణాలు ఉన్నాయా? అన్న చర్చ నడుస్తోంది. కచ్చితంగా ఆయన ఢిల్లీ పెద్దలను కలిసేందుకే వెళుతున్నారని మరోరకంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బిజెపిని వదులుకుంటే ఏపీలో జగన్కు నెగ్గుకు రావడం కష్టం. అందుకే ఒకవైపు పవన్ ద్వారా, మరోవైపు పురందేశ్వరి ద్వారా బిజెపి పెద్దలను కలిసేందుకు చంద్రబాబు ప్రయత్నించారని ఒక టాక్ నడుస్తోంది . ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో బిజెపి ఏపీపై ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. అందులో భాగంగా బిజెపి పెద్దలే చంద్రబాబును పిలిచి ఉంటారన్న టాక్ కూడా ఉంది. మొత్తానికైతే చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత ఏపీలో రాజకీయ సమీకరణలు మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.