YS Jagan New Strategy: అమరావతి ఉద్యమానికి చెక్ చెప్పే జగన్ కొత్త వ్యూహం

YS Jagan New Strategy: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని గత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినా ప్రస్తుత ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల జీవో తెచ్చి అభాసుపాలైంది. ఇప్పుడు మరో ఉపద్రవం వచ్చింది. అమరావతి గ్రామాల్లో స్థానిక ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని హైకోర్టు ప్రశ్నించడంతో ప్రభుత్వం హైరానా పడుతోంది. అమరావతిని కార్పొరేషన్ చేసేందుకు అన్ని సిద్ధం చేసింది. దీంతో ఆ గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించలేదని చెబుతోంది. గ్రామాల్లో నగరపాలక సంస్థలో కలిపేందుకు నిర్ణయం తీసుకున్నామని దీనిపై […]

Written By: Srinivas, Updated On : January 4, 2022 11:57 am
Follow us on

YS Jagan New Strategy: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని గత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినా ప్రస్తుత ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల జీవో తెచ్చి అభాసుపాలైంది. ఇప్పుడు మరో ఉపద్రవం వచ్చింది. అమరావతి గ్రామాల్లో స్థానిక ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని హైకోర్టు ప్రశ్నించడంతో ప్రభుత్వం హైరానా పడుతోంది. అమరావతిని కార్పొరేషన్ చేసేందుకు అన్ని సిద్ధం చేసింది. దీంతో ఆ గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించలేదని చెబుతోంది. గ్రామాల్లో నగరపాలక సంస్థలో కలిపేందుకు నిర్ణయం తీసుకున్నామని దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా అని గ్రామసభలు నిర్వహించనుంది. ఈ మేరకు కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలుస్తోంది.

YS Jagan

తుళ్లూరు మంలంలోని 16 గ్రామాలు, మంగళగిరి మండలంలోని 3 గ్రామాలు కార్పొరేషన్ లో కలిపేందుకు నిర్ణయించింది. కానీ గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించకపోవడంపై పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడంతో కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే గ్రామాలపై ఓ పీటముడి ఏర్పడింది. రాజధాని ప్రాంత గ్రామాలు పంచాయతీ పరిధిలోకి రావని మున్సిపాలిటీ పరిధిలోకి వస్తాయని తెలుస్తోంది.

ఇన్నాళ్లుగా ఎందుకు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించలేదని కోర్టు అడుగుతోంది. రాజధాని ఏర్పాటులో కూడా లోపాలున్నాయని చెబుతోంది. పంచాయతీలు తీర్మానాలు చేయకపోవడం వంటి వాటిపై కోర్టు ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. ప్రభుత్వం లోపాలను సరిచేసుకోవాలని పేర్కొంది. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడంపై కూడా సందేహాలు వ్యక్తం చేసింది.

Also Read: ఏపీలో టికెట్ల వివాదం ఇప్పట్లో తేలేలాగా లేదుగా..!

ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలని ఆదేశించింది. అయితే స్థానిక ఎన్నికల కోసమే ప్రజాభిప్రాయ సేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వానికి ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. దీంతో స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియడం లేదు. కోర్టు అక్షింతలు వేయడంతో ప్రభుత్వం ఎన్నికలపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

మొత్తానికి అమరావతి ఉద్యమం నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్ననిర్ణయంతో ఉద్యమానికి చెక్ పెట్టినట్లు అయింది. గ్రామాలను కార్పొరేషన్ లో కలిపేంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీలు లేకుండా పోవడంతో ఇప్పుడు ఉద్యమం కూడా ముందుకు పోయే అవకాశాలు లేవని తెలుస్తోంది. అందుకే జగన్ ఉద్యమం ముందుకు వెళ్లకూడదనే ఉద్దేశంతోనే ఈ విధంగా చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు.

Also Read: జగన్ వైపు దూసుకొస్తున్న షర్మిల ‘బాణం’..!

Tags