Homeఎంటర్టైన్మెంట్Singer Sunitha: ఆ పని చేయడం అంటే చాలా ఇష్టం అంటున్న సింగర్ సునీత... వైరల్...

Singer Sunitha: ఆ పని చేయడం అంటే చాలా ఇష్టం అంటున్న సింగర్ సునీత… వైరల్ గా మారిన పోస్ట్ ?

Singer Sunitha: టాలీవుడ్ లో తన గాత్రంతో ప్రేక్షకులను గత కొన్ని సంవత్సరాలుగా మంత్రముగ్దులను చేస్తూ ఉన్నారు సింగర్ సునీత. కేవలం గాయని గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ ‏గానూ తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది సునీత. ఆమె గురించి తెలుగులో ప్రేక్షకులను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఉన్న టాప్ హీరోయిన్లతో సమానమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకుని వైవాహిక జీవితం లోకి అడుగుపెట్టారు సునీత. వివాహం అనంతరం కూడా సునీత తన కెరీర్‏ పరంగా ఫుల్ బిజీగా ఉంటున్నారు.

singer sunitha post on instagram about farming goes viral on media

అలానే సింగర్ సునీతకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె షేర్ చేసే ప్రతి అప్డేట్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. నెట్టింట్లో తన గాత్రంతో పాటలు పాడుతూ… లైవ్ వీడియోస్ ద్వారా అభిమానులతో ముచ్చటిస్తుంటారు సునీత. తాజాగా సోషల్ మీడియాలో సింగర్ సునీత షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సాధారణంగా సింగర్ ప్రకృతి ప్రేమికురాలు అన్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా తనకు వ్యవసాయం చేయడమంటే ఇష్టమంటూ అరటి తోటలో, కూరగాయల తోటలో పనిచేస్తున్న వీడియోను ఆమె అభిమానులతో పంచుకుంది. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ లో ” జాయ్ ఆఫ్ ఫార్మింగ్… నాకు సంగీతం ఇష్టం. నా కుటుంబం, స్నేహితులను నేను ప్రేమిస్తున్నాను. నేను నన్ను ఇష్టపడేవారిని ప్రేమిస్తున్నాను. నాకు వ్యవసాయం, తోటపని అంటే చాలా ఇష్టం… అంటూ రాసుకొచ్చింది సునీత. ప్రస్తుతం సునీత షేర్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version