Homeఎంటర్టైన్మెంట్Actor Sai Kiran: పాము చనిపోయాక కూడా దాని కోరల్లో విషం ఉంటుందంటున్న గుప్పెడంత మనసు...

Actor Sai Kiran: పాము చనిపోయాక కూడా దాని కోరల్లో విషం ఉంటుందంటున్న గుప్పెడంత మనసు సీరియల్ నటుడు… ఎవరంటే ?

Actor Sai Kiran: నటుడు సాయి కిరణ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోగా 25 కి పైగా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు ఈ నటుడు. ప్రస్తుతం తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్‌లో మహేంద్ర భూషణ్‌గా అలరిస్తున్నారు సాయి కిరణ్. కేవలం తెలుగు లోనే కాకుండా మలయాళంలో కూడా వరుస సీరియల్స్ చేస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా మారారు సాయి. కాగా సినిమాల ద్వారా కన్నా సీరియల్స్‌ ద్వారానే ఎక్కువ గుర్తింపు దక్కించుకున్నారు సాయి కిరణ్.

guppedantha manasu actor sai kiran interesting details about snakes

అయితే సాయి కిరణ్ గురించి ప్రేక్షకులకు తెలియని ఆశ్చర్యపోయే విషయం ఒకటి ఉంది. అది ఏంటి అని అనుకుంటున్నారా ? సాయి కిరణ్ వృత్తి నాటనే అయినా ఆయన ప్రవృత్తి మాత్రం పాములు పట్టడం. ఆ అలవాటు తోనే ఇప్పటి వరకు దాదాపు 800పైగా పాముల్ని పట్టారు సాయి కిరణ్. చిన్నప్పుడు జరిగిన చిన్న సంఘటన వల్ల పాములు పట్టడం అలవాటుగా మార్చుకున్న సాయి కిరణ్ అనుకోకుండా ఒకసారి పాముని కొట్టి చంపేయడంతో చాలా బాధపడ్డాడట. దీంతో పాముల్ని సంరక్షించాలి అనే ఉద్దేశ్యంతో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీలో చేరాడు సాయి కిరణ్. పాముల్ని పట్టడంలో మెళుకువలు నేర్చుకుని… ఇప్పుడు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీలో వైస్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు.

కాగా ‘విషం అనేది ప్రోటీన్ అని… అది అంత తొందరగా పోదని పాము చనిపోయిన ఒకటి రెండు నెలల వరకూ ఆ కోరల్లో విషం అలాగే ఉంటుందని చెప్పారు సాయి కిరణ్. ఆ కోరలు గుచ్చుకుంటే చనిపోవచ్చు అని కూడా హెచ్చరించారు. ఇండియాలో విషం చిమ్మే పాములు లేవు.. ఆఫ్రికాలో అలాంటి పాములు ఉన్నాయి. ఇండియాలో కాటు ద్వారానే విషం ఎక్కుతుంది.. పాము కాటు వేసిందంటే కేవలం భయం వల్ల తప్పితే మరోటి కాదు’ అంటూ పాముల గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు సాయి కిరణ్.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version