https://oktelugu.com/

Jagan Prashant Kishor: నిప్పులేనిదే పొగ రాదు.. కాంగ్రెస్ తో పొత్తు జగన్, పీకే ద్వయం వ్యూహమేనా?

Jagan Prashant Kishor: నిప్పులేనిదే పొగ వస్తుందంటారా? అది జరిగే పనేనా? దానిని నమ్మమంటారా? ఏపీలో వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ పక్షాల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలివి. వైసీపీ పొత్తుపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అధిష్టానానికి బ్లూ ఫ్రింట్ ఇచ్చిన నేపథ్యంలో ఎన్నెన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రకరకాలుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ పొత్తు పొడుపుపై ప్రస్తుతానికైతే స్పష్టత లేకున్నా పార్టీల వ్యవహార శైలి మాత్రం అనుమానాలకు తావిస్తోంది. కాంగ్రెస్ తో పొత్తు కథనాలపై వైసీపీలో ఎటువంటి […]

Written By:
  • Admin
  • , Updated On : April 25, 2022 11:31 am
    Follow us on

    Jagan Prashant Kishor: నిప్పులేనిదే పొగ వస్తుందంటారా? అది జరిగే పనేనా? దానిని నమ్మమంటారా? ఏపీలో వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ పక్షాల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలివి. వైసీపీ పొత్తుపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అధిష్టానానికి బ్లూ ఫ్రింట్ ఇచ్చిన నేపథ్యంలో ఎన్నెన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రకరకాలుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ పొత్తు పొడుపుపై ప్రస్తుతానికైతే స్పష్టత లేకున్నా పార్టీల వ్యవహార శైలి మాత్రం అనుమానాలకు తావిస్తోంది. కాంగ్రెస్ తో పొత్తు కథనాలపై వైసీపీలో ఎటువంటి గాభరా లేదు. గందరగోళం పడలేదు. అధిష్టానం కూడా పట్టించుకోలేదు. అదే సమయంలో తమకు నచ్చని వ్యవహారంపై సోషల్ మీడియాలో దూనమాడే వైసీపీ బ్యాచ్ కూడా పెద్దగా స్పందించలేదు. అధిష్టానం ఆదేశాలున్నట్టు ఎవరూ నోరు మెదపడం లేదు. అయితే ఈ పరిణామాలపై కాంగ్రెస్ కూడా స్పందించడం లేదు. స్పందించిన నాయకులూ ఆ పార్టీలో లేరు. ఎందుకంటే వైసీపీతో పొత్తుతోనయినా పది, పన్నెండు అసెంబ్లీ సీట్టు, ఒకటి రెండు లోక్ సభ స్థానాలైనా దక్కుతాయని ఆ పార్టీలో కొత్త ఆశలు చిగురించాయి. వైసీపీ అగ్ర నాయకుల్లో ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే బాధ్యత తీసుకునే పార్టీలతో కలిసి నడుస్తామని ఆయన నర్మగర్భంగా చెప్పుకొచ్చారు. ఇందులో ఎంతో నిగూడార్థం ఉంది. బీజేపీతో పాటు దానికి దగ్గరగా ఉండే పక్షాలు సైతం ఇటీవల కాంగ్రెస్ పై విమర్శలు తగ్గించాయి. మరోవైపు ప్రశాంత్ కిశోర్ రూపంలో పార్టీ బలోపేతంపై బ్లూ ఫ్రింట్ తయారవుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఆలోచన మార్చిందన్న అనుమానం బీజేపీని వెంటాడుతోంది. కేసుల విచారణ గడువు దగ్గరికి వస్తున్న నేపథ్యంలో తెర వెనుక వైసీపీ ఏదో మంత్రాంగం నడుపుతుందన్న అనుమానం బీజేపీని వెంటాడుతుంది. ఇటీవల వైసీపీ, బీజేపీ మధ్య సంబంధాలు ఏమంత ఆశాజనకంగా కూడా లేవు. ప్రస్తుతానికి అటు వైసీపీ, ఇటు బీజేపీ గుంభనంగా వ్యవహరిస్తున్నాయి.

    Jagan Prashant Kishor

    Y S Jagan-Prashant Kishor

    అందరిలోనూ అనుమానం

    అసలు సీఎం జగన్ సమ్మతం లేకుండా ప్రశాంత్ కిశోర్ బ్లూఫ్రింట్ ఇస్తారా అన్న అనుమానం అందరిలోనూ నెలకొంది. వైసీపీని అధికారంలోకి తీసుకురావడంలో పీకేదే ప్రధాన పాత్ర. ప్రజల్లో వర్గ విభేదాలు రెచ్చగొట్టిన పీకేకు చెందిన ఐప్యాక్ టీమ్ జగన్ గెలుపునకు ఎంతగానో క్రుషి చేసింది. ఇప్పటికీ ఐపాక్ టీమ్ వైసీపీకి సేవలందిస్తునే ఉంది. ఈ సమయంలో పీకే కాంగ్రెస్ కు ఇచ్చిన బ్లూ ఫ్రింట్ పై ఇష్టం లేకుంటే వైసీపీ నాయకులు, శ్రేణులు ప్రశాంత్ కిశోర్ కు తిట్టిపోసి ఉండేవారు. కానీ అలా జరగలేదు. కనీసం వైసీపీ నేతలు పీకేపై వ్యాఖ్యానించేందుకు సైతం ఆసక్తి చూపడం లేదు. అయితే ఈ విషయంలో అధిష్టానం నేతలకు స్ఫష్టమైన సంకేతాలు పంపించి ఉండవచ్చన్న అనుమానాలు వెల్లవెత్తుతున్నాయి. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉంది. ఒక వేళ బీజేపీ పై వ్యతిరేకత ప్రారంభమై కాంగ్రెస్ పార్టీ బలం పెరిగితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నేత్రుత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంది. అప్పుడు కేసుల నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ దోహదపడుతుందని జగన్ ప్రశాంత్ కిశోర్ ద్వయం ఆలోచనగా టాక్ నడుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ వైసీపీని కాంగ్రెస్ డీఎన్ఏ పార్టీగా అభివర్ణిస్తుంటారు. వైసీపీలో కీలక నాయకుల పూర్వశ్రమం కాంగ్రెస్ పార్టీనే. ఒక వేళ కాంగ్రెస్ కేంద్రంలో అధికారం చేపడితే కేసుల నుంచి ఉపశమనంతో పాటు రాష్ట్రంలో అధికారం పదిలం చేసుకోవచ్చన్న ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. సో ఎన్నికలు గడువు సమీపిస్తున్న కొలదీ దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.

    Tags