https://oktelugu.com/

టీఆర్ఎస్ ఆ ఒక్క తప్పిదం.. ‘హస్తం’ అస్త్రమట?

టీఆర్‌‌ఎస్‌ గవర్నమెంట్‌ చేసిన ఒక్క తప్పిదం ఇప్పుడు కాంగ్రెస్‌ పాయింట్‌ కాబోతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఎల్‌ఆర్‌‌ఎస్‌ స్కీంపై ఇప్పటికే తెలంగాణ ప్రజల్లో చెప్పలేనంత వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ స్కీం ప్రకారం.. ప్రతీ ఖాళీ స్థలం, ఇంటి స్థలంతో పాటు ఏ ఆస్తి ఉన్నా అదనంగా పన్ను కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పైగా రిజిస్ట్రేషన్లు కూడా నిలిపివేశారు. కేసీఆర్‌‌ తీసుకున్న  ఈ నిర్ణయం తుగ్లక్‌ అని ఇప్పటికే ప్రజల్లో ఓ భావన పెరిగింది. కరోనా కరువు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 6, 2020 3:00 pm
    lrs telangana

    lrs telangana

    Follow us on

    lrs telangana

    టీఆర్‌‌ఎస్‌ గవర్నమెంట్‌ చేసిన ఒక్క తప్పిదం ఇప్పుడు కాంగ్రెస్‌ పాయింట్‌ కాబోతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఎల్‌ఆర్‌‌ఎస్‌ స్కీంపై ఇప్పటికే తెలంగాణ ప్రజల్లో చెప్పలేనంత వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ స్కీం ప్రకారం.. ప్రతీ ఖాళీ స్థలం, ఇంటి స్థలంతో పాటు ఏ ఆస్తి ఉన్నా అదనంగా పన్ను కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పైగా రిజిస్ట్రేషన్లు కూడా నిలిపివేశారు. కేసీఆర్‌‌ తీసుకున్న  ఈ నిర్ణయం తుగ్లక్‌ అని ఇప్పటికే ప్రజల్లో ఓ భావన పెరిగింది. కరోనా కరువు టైంలో ప్రభుత్వం ఖజానా నింపుకునేందుకే ఇలాంటి దోపిడీకి తెరలేపిందనే విమర్శలూ వినిపిస్తున్నాయి.

    Also Read: ఎంసెట్‌ రిజల్ట్స్‌ ఇలా తెలుసుకోండి..క్వాలిఫై కావాలంటే?

    అయితే.. రాష్ట్రంలో మున్ముందు ఎన్నికలు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌ ఇదే వ్యూహాన్ని ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎల్‌ఆర్‌‌ఎస్‌ ఎవరూ కట్టొద్దని.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఉచితం ప్లాట్లను క్రమద్ధీకరిస్తామని ప్రకటించారు. ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి మూడు లక్షల కోట్లను పిండుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేతలు లెక్కలు చెబుతున్నారు. ప్రజలను ప్రభుత్వం దోచుకుంటోందని ధర్నాలూ చేస్తున్నారు. ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు.

    ఎల్‌ఆర్ఎస్ అంశమే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌లా మారింది. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత కారణంగా ప్రభుత్వం కూడా పదే పదే వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. పేదల నుంచి డబ్బు వసూలు చేయడానికి ఈ పథకం ప్రవేశ పెట్టలేదని.. రికార్డులన్నీ సక్రమంగా చేసేందుకు చేస్తున్నామని వాదిస్తోంది. ఫీజు తగ్గిస్తున్నామని ప్రకటన చేసింది.

    Also Read: అన్ లాక్ 5: స్కూళ్ల ఓపెన్ మార్గదర్శకాలివీ

    అయితే.. ఇప్పటివరకు లేఔట్లకు అనుమతులు ఇచ్చింది కూడా ప్రభుత్వమే. కానీ.. ప్రభుత్వమే మళ్లీ అక్రమం అని ఫీజులు చెల్లించాలనడం ఏంటన్న అభిప్రాయం ప్రజల్లో కనిపిస్తోంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో పడింది. సాధారణంగా ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు రుణాలు కట్టొద్దని పన్నులు చెల్లించొద్దని.. తామొస్తే మాఫీ చేస్తామని ప్రకటనలు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు.. కాంగ్రెస్‌కు ముందుగానే ఓ అస్త్రం దొరికింది. తెలంగాణ ప్రజల్లో ఉన్న అసంతృప్తి వారికి బలంగా మారే అవకాశం ఉందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.